- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
India vs Pakistan : పాక్‌కు చుక్కలు చూపించిన ఇషాన్ కిషన్.. యువీ రికార్డు బ్రేక్..!
పాకిస్తాన్‌తో జరుగుతున్న హై-వోల్టేజ్ పోరులో టీమిండియా ఓపెనర్ ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మెరుపు హాఫ్ సెంచరీతో పాక్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టిన ఇషాన్.. రికార్డుల వేటలో టీమిండియా దిగ్గజం యువరాజ్ సింగ్‌ను వెనక్కి నెట్టాడు.

దిశ, డైనమిక్ బ్యూరో: టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న హై-వోల్టేజ్ పోరులో టీమిండియా ఓపెనర్ ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మెరుపు హాఫ్ సెంచరీతో పాక్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టిన ఇషాన్.. రికార్డుల వేటలో టీమిండియా దిగ్గజం యువరాజ్ సింగ్‌ను వెనక్కి నెట్టాడు. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం సాక్షిగా ఇషాన్ కిషన్ తన బ్యాట్‌తో పాక్‌కు చుక్కలు చూపించాడు.
యువీ రికార్డు బ్రేక్..
ఈ మ్యాచ్‌లో కేవలం 27 బంతుల్లోనే ఇషాన్ కిషన్ తన అర్ధశతకాన్ని పూర్తి చేశాడు. ఫలితంగా భారత్-పాక్ టీ 20 పోరులో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన మూడో ఆటగాడిగా ఇషాన్ నిలిచాడు. 2012లో అహ్మదాబాద్ వేదికగా పాక్‌పై యువీ సాధించిన 29 బంతుల హాఫ్ సెంచరీ రికార్డును ఇషాన్ తాజాగా అధిగమించాడు. ప్రస్తుతం ఈ జాబితాలో మహ్మద్ హఫీజ్ (23 బంతులు), అభిషేక్ శర్మ (24 బంతులు) మొదటి రెండు స్థానాల్లో ఉండగా.. ఇషాన్ మూడో స్థానానికి చేరుకున్నాడు.
గాయపడినా తగ్గని వేగం..
కాగా, ఇన్నింగ్స్ మధ్యలో రివర్స్ స్వీప్ ఆడే క్రమంలో ఇషాన్ కిషన్ కిందపడిపోవడంతో భారత శిబిరంలో కాసేపు ఆందోళన నెలకొంది. కుడి కాలు పట్టేయడంతో మైదానంలోనే పడుకున్న ఇషాన్‌ను ఫిజియో వచ్చి పరీక్షించారు. కాసేపు ఆట నిలిచిపోయింది. అయితే, పట్టుదలతో మళ్ళీ బ్యాట్ పట్టిన ఇషాన్.. ఏమాత్రం తడబడకుండా పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ ఆచితూచి ఆడుతుండగా.. ఇషాన్ మాత్రం బౌండరీల వర్షం కురిపించాడు. ఇషాన్ కిషన్ 77 పరుగుల వద్ద సైమ్ అయూబ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 88 పరుగుల వద్ద రెండో వికెట్‌ను టీమ్‌ఇండియా కోల్పోయింది. ఇషాన్ కిషన్ తన 77 పరుగుల ఇన్నింగ్స్‌లో సిక్సర్లు, ఫోర్లతో పాక్ ఫీల్డర్లకు పని చెప్పాడు.






