ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ టాప్.. ‘నెం.1’ స్థానాన్ని అట్టిపెట్టుకున్న టీమిండియా!

by Malleboina Mahesh |

ఐసీసీ పురుషుల వన్డే వార్షిక ర్యాంకింగ్స్‌లో టీమిండియా 118 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 113 పాయింట్లతో న్యూజిలాండ్ రెండో స్థానంలో ఉంది.

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ టాప్.. ‘నెం.1’ స్థానాన్ని అట్టిపెట్టుకున్న టీమిండియా!
X

దిశ, వెబ్ డెస్క్: భారత క్రికెట్ జట్టు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాస్ స్థానాన్ని మరోసారి అంటిపెట్టుకుంది. తాజాగా విడుదల చేసిన వార్షిక ర్యాంకింగ్స్ (Annual rankings) అప్‌డేట్‌లో భారత క్రికెట్ జట్టు (Indian cricket team) నెంబర్ -1 స్థానాన్ని దక్కించుకుంది. వన్డే క్రికెట్‌లో ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టుగా 'నెం.1' స్థానాన్ని టీమిండియా విజయవంతంగా నిలబెట్టుకుంది. అయితే, ఈ వార్షిక మార్పుల తర్వాత ద్వితీయ స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌తో పోలిస్తే భారత్‌కు ఉన్న పాయింట్ల ఆధిక్యం ఎనిమిది నుంచి ఐదు పాయింట్లకు తగ్గింది. ఈ అప్‌డేట్ తర్వాత టీమిండియా ఖాతాలో ఒక పాయింట్ తగ్గి 118 పాయింట్లకు చేరుకోగా, కివీస్ జట్టు రెండు పాయింట్లను లాభపడి 113 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.

ప్రస్తుత ప్రపంచ కప్ ఛాంపియన్స్ అయిన ఆస్ట్రేలియా జట్టు ఎలాంటి మార్పు లేకుండా 109 పాయింట్లతో మూడో స్థానంలోనే స్థిరంగా కొనసాగుతోంది. కాగా, ఈసారి ఐసీసీ వన్డే టాప్-10 జట్ల జాబితాలో ఒకే ఒక మార్పు చోటుచేసుకుంది. అంతకుముందు వరకు నాలుగో స్థానంలో కొనసాగిన పాకిస్తాన్ (98 పాయింట్లు) ఐదో స్థానానికి పడిపోగా.. వారిని వెనక్కి నెట్టి దక్షిణాఫ్రికా జట్టు 102 పాయింట్లతో నాల్గవ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఒడిదుడుకులు ఎదురైనా అగ్రస్థానాన్ని కాపాడుకోవడంలో భారత్ సాధించిన ఈ విజయంపై మేనేజ్‌మెంట్, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story