తొలి వన్డేలో భారత్ ఘన విజయం.. అఫ్ఘాన్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపు

by Ramesh Naini |

అఫ్ఘానిస్తాన్‌తో ఏకైక టెస్టులో ఇన్నింగ్స్ విజయం సాధించిన టీమ్ఇండియా.. వన్డే సిరీస్‌లోనూ అదే జోరును కొనసాగించింది.

తొలి వన్డేలో భారత్ ఘన విజయం.. అఫ్ఘాన్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపు
X

దిశ, డైనమిక్ బ్యూరో: అఫ్ఘానిస్తాన్‌తో ఏకైక టెస్టులో ఇన్నింగ్స్ విజయం సాధించిన టీమ్ఇండియా.. వన్డే సిరీస్‌లోనూ అదే జోరును కొనసాగించింది. ధర్మశాల వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో శుభారంభం చేసింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 25 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్ఘానిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం భారత్ 22.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. భారత ఇన్నింగ్స్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (84* )బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడగా.. కేఎల్ రాహుల్ (39*), ఇషాన్ కిషన్ (34), రోహిత్ శర్మ (16) పరుగులు చేశారు.

గిల్ సరికొత్త రికార్డు.. ఫాస్టెస్ట్ 3000

ఈ మ్యాచ్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నిలకడగా ఆడుతూ కేవలం 37 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ క్రమంలోనే వన్డేల్లో అత్యంత వేగంగా (62 ఇన్నింగ్స్‌ల్లో) 3 వేల పరుగులు పూర్తి చేసిన భారత ఆటగాడిగా గిల్ సరికొత్త రికార్డు సృష్టించాడు. కాగా, భారత్, అఫ్ఘాన్ల మధ్య రెండో వన్డే బుధవారం (జూన్ 17) లఖ్‌నవూ వేదికగా జరగనుంది.

Next Story