హ‌ర్ధిక్ పాండ్యా ప్రియురాలు మ‌హికా ఆస్తులు ఎంతో తెలుసా ?

by velandi.Saikiran |

హార్దిక్ పాండ్యా ప్రియురాలు మహికా శర్మ నిక‌ర విలువ 3 నుంచి 4 కోట్ల మ‌ధ్య ఉంటుందట‌.

హ‌ర్ధిక్ పాండ్యా ప్రియురాలు మ‌హికా ఆస్తులు ఎంతో తెలుసా ?
X

దిశ‌, వెబ్ డెస్క్: భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రియురాలు మహికా శర్మ పుట్టిన రోజు నిన్న జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమెకు స్పెషల్ ట్రీట్ ఇచ్చాడు హార్థిక్ పాండ్యా. ఉదయం పూట స్విమ్మింగ్ పూల్ లో దిగిన ఫోటోలను పోస్ట్ చేసి, మహికా శర్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఇక సాయంత్రం ఆమెతో కేక్ కట్ చేయించాడు పాండ్యా. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు అలాగే ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మహికా శర్మ బ్యాక్ గ్రౌండ్, ఆస్తుల వివరాలు

హార్దిక్ పాండ్యాకు కాబోయే భార్య మహికా శర్మ ప్రముఖ మోడల్, నటి అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె వయసు 24 సంవత్సరాలు. 2000 సంవత్సరం ఫిబ్రవరి 19వ తేదీన జన్మించింది. ఆమెది ఢిల్లీ. హిందూ కుటుంబానికి సంబంధించిన వ్యక్తినే ఈ మహికా శర్మ. ప్రస్తుతం హార్దిక్ పాండ్యాతో డేటింగ్ లో ఉన్న మహికా శర్మ, త్వరలో అతన్ని పెళ్లి చేసుకోబోతోంది. ఇక హార్దిక్ పాండ్యాకు, మహికా శర్మకు ఎనిమిది సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉంటుంది. ఆమె నిత్యం యోగ, ట్రావెలింగ్, డాన్సింగ్, రీడింగ్ బుక్స్ లాంటివి చేస్తుంది. ఇక ప్రస్తుతం అందుతోన్న సమాచారం ప్రకారం మహికా శర్మ ఆస్తులు 3.4 కోట్లు మాత్రమే అని తెలుస్తోంది. ఇది ఇలా ఉండ‌గా, మొన్న వాలైంటేన్స్ డే సంద‌ర్భంగా మ‌హికా శ‌ర్మ పేరు వ‌చ్చేలా టాటూ వేయించుకున్నాడు హ‌ర్ధిక్ పాండ్యా.

Next Story