త్వరగా టాపార్డర్ కుప్పకూలడం వల్లే : స్మిత్

3

దిశ, వెబ్‌డెస్క్ : ఢిల్లీ చేతిలో రాజస్థాన్ రాయల్స్ ఓటమి పాలైన అనంతరం ఆ జట్టు కెప్టెన్ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్ చాలా నిరాశ కలిగించింది. దుబాయ్ వికెట్ రెండో ఇన్నింగ్స్‌లో పూర్తిగా నెమ్మదిస్తున్నది. బట్లర్, స్టోక్స్ సరైన ఆరంభాన్నే అందించారు. కానీ త్వరగా టాపార్డర్ వికెట్లు కోల్పోవడం మాకు నష్టాన్ని చేకూర్చింది. బౌలింగ్‌లో మా జట్టు అనుకున్న వ్యూహాలను అమలు చేసినా.. డెత్ ఓవర్లలో బ్యాటింగ్ సరిగా చేయలేకపోయాము.

                                                                               – స్టీవ్ స్మిత్, కెప్టెన్, రాజస్థాన్ రాయల్స్

ఇది పూర్తిగా జట్టు సమిష్టి విజయం. రాజస్థాన్ బ్యాటింగ్ లైనప్ చివర్లో బలంగా ఉండదనే విషయం మాకు తెలుసు. అందుకే టాప్ ఆర్డర్‌ను త్వరగా పంపాలనే వ్యూహం అమలు చేసి విజయవంతమయ్యాము. దేశ్‌పాండేకు మొదటి మ్యాచ్ అయినా చాలా ధైర్యంగా బౌలింగ్ చేశాడు. ఈ టోర్నమెంట్ అంతా అతడు ఇలాగే ఆడాలని కోరుకుంటున్నా. శ్రేయస్ భుజానికి తీవ్రగాయంమైంది. గురువారం రిపోర్ట్స్ వస్తాయి.

                                                                              – శిఖర్ ధావన్, తాత్కాలిక కెప్టెన్, ఢిల్లీ

క్యాపిటల్స్ తరఫున గత కొద్ది రోజులుగా మంచి బౌలింగ్ చేస్తున్నాను. అయితే ఈ సారి కీలక వికెట్లు తీసి పరుగులు రాకుండా కట్టడి చేయగలగడం సంతోషాన్ని ఇచ్చింది. నేను నా బలంపై నమ్మకం ఉంచాను. అందుకే బట్లర్ మొదటి బంతికి సిక్స్ కొట్టినా భయపడలేదు. మాకు మంచి కోచ్ ఉండటం కలసి వస్తున్నది.

                                                                  – ఎన్రిక్ నోర్జే, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, ఢిల్లీ క్యాపిటల్స్