బెంగాల్‌లో ఎమ్మెల్యేగా గెలిచిన క్రికెటర్

by  |
బెంగాల్‌లో ఎమ్మెల్యేగా గెలిచిన క్రికెటర్
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో గెలుపొందాడు. గత ఫిబ్రవరిలో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన మనోజ్‌కు టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ షిబ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ కేటాయించారు. ఆదివారం వెలువడిన ఫలితాల్లో మనోజ్ తివారి తన సమీప ప్రత్యర్థి బీజేపీకి చెందిన రథిన్ చక్రబర్తిపై 6వేల ఓట్లకుపైగా మెజార్టీతో గెలుపొందాడు. మనోజ్ తివారి టీమ్ ఇండియా తరపున 2008లో ఆస్ట్రేలియా తరపున అరంగేట్రం చేశాడు. తన కెరీర్‌లో 12 వన్డేలు, 2 అంతర్జాతీయ టీ20లు ఆడాడు. వన్డేల్లో ఒక సెంచరీ, మరో అర్దసెంచరీ చేసిన మనోజ్ టీ20ల్లో మాత్రం విఫలం అయ్యాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరఫున ఆడాడు. 20018 ఐపీఎల్ సీజన్ అతడికి చివరిది. పంజాబ్ జట్టు అతడిని 2018లో రూ.1 కోటికి కొనుక్కున్నది. 2018-19 సీజన్ విజయ్ హజారే ట్రోఫీలో బెంగాల్ తరపున అత్యధిక స్కోర్ రికార్డు మనోజ్ తివారి పేరిటే ఉన్నది. కాగా, తివారి ఇంత వరకు తన క్రికెట్ కెరీర్‌కు అధికారికంగా గుడ్‌బై చెప్పకపోవడం గమనార్హం.


Next Story