క్రేజీ న్యూస్: ఒకే ఫ్రేంలో తారక్, విజయ్?

by  |
క్రేజీ న్యూస్: ఒకే ఫ్రేంలో తారక్, విజయ్?
X

దిశ, సినిమా : యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఇళయ దళపతి విజయ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతున్నారా? నెక్స్ట్ ప్రాజెక్ట్‌లో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారా? బిగ్ స్టార్స్ ఇద్దరూ బాక్సాఫీస్‌ను షేక్ చేయబోతున్నారా? అన్న ప్రశ్నలు ఫ్యాన్స్‌కు కిక్ ఇస్తున్నారు. కోలీవుడ్, టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ రిపోర్ట్ ప్రకారం.. అట్లీ డైరెక్షన్‌లో తారక్, విజయ్‌ మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నారని తెలుస్తోంది.

సోషల్ మీడియాలో ఈ వార్త సర్కులేట్ అవుతుండగా, అభిమానులు సెలబ్రేట్ చేసుకునేందుకు రెడీ అని చెప్తున్నారు. అయితే ఈ విషయమై ఇంకా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ లేకపోయినా ఫ్యాన్స్ మాత్రం హ్యాపీగా ఫీలవుతున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ వర్కౌట్ అయితే బాగుంటుందని ఆశపడుతున్నారు. కాగా ప్రస్తుతం విజయ్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్‌లో సినిమా చేస్తుండగా సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. మరో వైపు తారక్ ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు.


Next Story