- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాబు గారు.. బిజీగా ఉండటం వల్లే దీక్ష వద్దకు రాలేకపోతున్నా: నారాయణ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేపట్టిన ‘ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు’ దీక్ష రెండోరోజుకు చేరుకుంది. గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ దీక్ష శుక్రవారం రాత్రి 8గంటల వరకు కొనసాగనుంది. చంద్రబాబు చేస్తున్న దీక్షకు పలువురు ప్రముఖులు మద్దతు ప్రకటించారు. తాజాగా చంద్రబాబుకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మద్దతు తెలిపారు. శుక్రవారం ఉదయం నారాయణ.. చంద్రబాబుకు ఫోన్ చేశారు. వేరే పనుల్లో బిజీగా ఉండటం వల్లే తాను దీక్ష వద్దకు […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేపట్టిన ‘ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు’ దీక్ష రెండోరోజుకు చేరుకుంది. గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ దీక్ష శుక్రవారం రాత్రి 8గంటల వరకు కొనసాగనుంది. చంద్రబాబు చేస్తున్న దీక్షకు పలువురు ప్రముఖులు మద్దతు ప్రకటించారు. తాజాగా చంద్రబాబుకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మద్దతు తెలిపారు. శుక్రవారం ఉదయం నారాయణ.. చంద్రబాబుకు ఫోన్ చేశారు. వేరే పనుల్లో బిజీగా ఉండటం వల్లే తాను దీక్ష వద్దకు రాలేకపోతున్నానని తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీ నేతల దాడులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని వ్యాఖ్యానించారు. టీడీపీ కార్యాలయాలపై దాడులకు పాల్పడిన దుండగులపై చర్యలు తీసుకోవాలని నారాయణ డిమాండ్ చేశారు.
Next Story






