బిగ్ బాస్ ఒక బ్రోతల్ షో.. నాగార్జున ఆలోచించు.. సీపీఐ నారాయణ సంచలన కామెంట్స్..

63

దిశ, డైనమిక్ బ్యూరో: హీరో నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ షో బోర్ డమ్ ను తొలగిస్తామంటూ ముందుకొచ్చి గత వారం రోజులుగా సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. అయితే దీనిపై కొందరు విమర్శలు చేస్తున్నారు. ప్రతి సారి బిగ్‌బాస్ షో ను బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేసే సీపీఐ నారాయణ, ఈ సారి కూడా షో మొదట్లోనే విమర్శిస్తూ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే.

తాజాగా సీపీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ..  బిగ్‌బాస్ ప్రోగ్రాం ఓ బ్రోతల్ షో అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నైతిక విలువలు దెబ్బతినేలా పిల్లల బుర్రలు పాడయ్యేలా ఈ ప్రోగ్రాం ఉందని, నేరాలు పెరగడానికి ఇలాంటి షోలే కారణమౌతున్నాయని ఆయన మండిపడ్డారు. హోస్ట్‌గా ఉన్న నాగార్జున ఈ విషయమై ఆలోచించాలని ఆయన కోరారు. ఆయన తండ్రి ఏఎన్ఆర్ ఎన్నో గొప్ప సినిమాలు తీస్తే, నాగార్జున ఇలాంటి షోలు చేయడం ఏంటని ప్రశ్నించారు. బిగ్ బాస్ షోను నిలిపివేసేంతవరకు పోరాటం చేస్తానని, అవసరమైతే సుప్రీంకోర్టుకైనా వెళ్తానని నారాయణ తేల్చి చెప్పారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..