‘హైదరాబాద్ నిర్మించింది నేనే.. అదే కేసీఆర్ లక్ష్యం’

by  |
‘హైదరాబాద్ నిర్మించింది నేనే.. అదే కేసీఆర్ లక్ష్యం’
X

దిశ, న్యూస్‌బ్యూరో: సీఎం కేసీఆర్ కొత్త సచివాలయం నిర్మాణ నిర్ణయం చావు అప్పుడు పెళ్లి చేయడం లాంటిదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. ప్రజలు కరోనా చికిత్స అందక ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం కొత్త భవనాల నిర్మాణాల కోసం ఆలోచనలు చేయడం అప్రజాస్వామికమని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం నారాయణ ఓ ప్రకటన విడుదల చేశారు. వికార్ ఉల్ ఉమ్రా ఆలోచన ప్రకారం.. లండన్ రాజప్రసాదం దగ్గర బకినింగ్ హోమ్ ప్యాలెస్ నమూనాతో ఆరో నిజాం సచివాలయంలో ఒక భవనాన్ని కట్టాడని గుర్తుచేశారు. వికారాబాద్‌కు ఆయన పేరే నామకరణం చేశారన్నారు. అలాంటి ప్రాముఖ్యత కలిగిన భవనాన్ని పురావస్తు శాఖకు అప్పగించినట్టయితే బాగుండేదన్నారు. ఇలాంటి భవనాన్నికూల్చీవేస్తే హైదరాబాద్ ప్రాముఖ్యత ఏమి కనిపిస్తుందని ప్రశ్నించారు. కేసీఆర్ శకం నుంచి హైదరాబాదు నిర్మాణం అయినట్టు చూపిస్తున్నారని విమర్శించారు. గతంలో నిజాం నవాబు పరిపాలన గాని, పది మంది ముఖ్యమంత్రులు పాలించినట్టు గాని చెప్పకుండా నేనే హైదరాబాద్ నిర్మించినట్టు చూపించాలని ఉద్దేశంతో కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కేసులలో భారతదేశంలో హైదరాబాద్ కూడా స్థానం సంపాదించుకుందని, కోవిడ్‌తో బాధపడుతున్న ప్రజలను కాపాడాల్సింది పోయి కొత్త సచివాలయం పడగొట్టడం అంటే మానవత్వ వ్యతిరేక చర్యని మండిపడ్డారు.

Next Story

Most Viewed