- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'తెల్లరేషన్ కార్డుదారులందరికీ కేంద్ర సాయం అందించాలి'
<p>దిశ, న్యూస్‌బ్యూరో : కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో కేంద్ర ప్రభుత్వం పేదలకు ఇవ్వదలచిన ఆర్థిక సాయాన్ని తెల్లరేషన్ కార్డుదారులందరికీ వర్తింపచేయాలని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు నిత్యావసర సరుకులతో పాటు ఆర్థిక సాయాన్ని కూడా అందించాలని కోరారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు రాసిన బహిరంగ లేఖలో ఆయన పలు ఆంశాలు ప్రస్తావించారు. రాష్ట్రంలో (ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన) […]</p>
దిశ, న్యూస్‌బ్యూరో : కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో కేంద్ర ప్రభుత్వం పేదలకు ఇవ్వదలచిన ఆర్థిక సాయాన్ని తెల్లరేషన్ కార్డుదారులందరికీ వర్తింపచేయాలని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు నిత్యావసర సరుకులతో పాటు ఆర్థిక సాయాన్ని కూడా అందించాలని కోరారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు రాసిన బహిరంగ లేఖలో ఆయన పలు ఆంశాలు ప్రస్తావించారు. రాష్ట్రంలో (ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన) ఖాతాలను ఆయా బ్యాంకులు కాలక్రమేణా సాధారణ ఖాతాలుగా మార్చాయని తెలిపారు. దీంతో లాక్‌డౌన్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పేదలకు అందించే ఆర్థిక సాయాన్ని వారు కోల్పోతున్నారని తెలిపారు. కాగా, ఈ ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం మాదిరిగా తెల్లరేషన్ కార్డులందరకీ వర్తింపచేయాలని కోరారు. లాక్‌డౌన్‌తో చేనేత సహకార సంఘాల వద్ద వస్త్ర నిల్వలు పేరుకుపోయి కార్మికులకు పని ఇచ్చే నాథుడే కరువయ్యారని తెలిపారు. ‘ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం కార్మికులకు అండగా ఉండి, ప్రతి కుటుంబానికి నిత్యావసర సరుకులతో పాటు రూ.5000 తక్షణ సాయం కింద అందించాలని’ అన్నారు. వస్త్ర నిల్వలను ప్రభుత్వమే కొనుగోలు చేసి, నూలు రవాణాను చేపట్టాలని సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో చాడ వెంకట రెడ్డి డిమాండ్ చేశారు.
Tags : Central Govt help, CPI, CM KCR, open letter, Corona, Lock down






