కోవిడ్ వ్యాక్సిన్ చోరీ.. షాక్ లో డాక్టర్లు

by  |
కోవిడ్ వ్యాక్సిన్ చోరీ.. షాక్ లో డాక్టర్లు
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా కోరలు చాస్తోంది. తగ్గినట్లు తగ్గి మళ్లీ కల్లోలం సృష్టిస్తుంది. కరోనా నియమాలు ఎన్ని పాటిస్తున్నా మహమ్మారి బారిన పడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే టీకాలు మాత్రమే కరోనాను కట్టడి చేయగలవని ప్రభుత్వాలు నమ్మకంగా చెప్తున్నాయి. కొంతమంది కొన్ని అపోహలకు భయపడి వ్యాక్సిన్ కి దూరంగా ఉంటున్నారు. మరికొంతమంది వ్యాక్సిన్ వేయించుకోవాలనుకున్న వ్యాక్సిన్ కొరత వలన కుదరడం లేదు. ఇక తాజాగా జైపూర్‌లో అయితే కోవిడ్ వ్యాక్సిన్ చోరీకి గురవడం చర్చనీయాంశమైంది. జైపూర్‌లోని కన్వాటియా ఆస్పత్రిలో కోవిడ్ వ్యాక్సిన్లను గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారు. వ్యాక్సిన్లను కోల్డ్ స్టోరేజ్‌కు తరలిస్తున్న సమయంలో కొంతమంది దుండగులు ఆసుపత్రి లోపలి చొరబడి బాక్స్ ల్లో ఉన్న వ్యాక్సిన్ ని దొంగిలించారు. దాదాపు 320 వ్యాక్సిన్లను దుండగులు ఎత్తుకెళ్లారని అంచనా. ఈ ఘటనపై ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. 320 డోసులు మిస్సయ్యాయి అని తెలుసుకొని షాక్‌ అయ్యామని, త్వరలోనే ఆ దొంగలను పోలీసులు పట్టుకుంటామన్నారని మెడికల్ చీఫ్ ఆఫీసర్ నరోత్తం శర్మ పేర్కొన్నారు


Next Story

Most Viewed