- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశాఖలో మరో ప్రాణం తీసిన ‘భయం’
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : కరోనా దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. కొందరు కరోనా సోకి చికిత్స పొందుతూ ప్రమాదవశాత్తు మృతి చెందుతుండగా, మరికొందరు పాజిటివ్ అని తేలగానే ఏం జరుగుతుందోననే భయంతో ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఇటువంటి ఘటనలు చాలానే వెలుగుచూశాయి. తాజాగా ఏపీలోని విశాఖలో కరోనా పాజిటివ్ వచ్చిన ఓ రోగి విమ్స్ బిల్డింగ్ పై నుంచి కిందకు దూకాడు. వి.సుధాకర్ అనే వ్యక్తికి ఇటీవల పాజిటివ్ రాగా భయంతో విమ్స్ భవనం నుంచి దూకి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. కొందరు కరోనా సోకి చికిత్స పొందుతూ ప్రమాదవశాత్తు మృతి చెందుతుండగా, మరికొందరు పాజిటివ్ అని తేలగానే ఏం జరుగుతుందోననే భయంతో ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఇటువంటి ఘటనలు చాలానే వెలుగుచూశాయి. తాజాగా ఏపీలోని విశాఖలో కరోనా పాజిటివ్ వచ్చిన ఓ రోగి విమ్స్ బిల్డింగ్ పై నుంచి కిందకు దూకాడు.
వి.సుధాకర్ అనే వ్యక్తికి ఇటీవల పాజిటివ్ రాగా భయంతో విమ్స్ భవనం నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విషయం తెలిసి బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
Next Story






