- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీడీపీకి గుడ్ న్యూస్.. పట్టాభికి బెయిల్ మంజూరు
<p>దిశ,ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ అయిన టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభికి బెయిల్ మంజూరైంది. రెండు రోజులు క్రితం పట్టాభి అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. అయితే బెయిల్‌పై శుక్రవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న ధర్మాసనం కేసు విచారణను శనివారానికి వాయిదా వేసింది. అయితే శనివారం కూడా పట్టాభి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. పట్టాభిని అరెస్ట్ […]</p>

X
దిశ,ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ అయిన టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభికి బెయిల్ మంజూరైంది. రెండు రోజులు క్రితం పట్టాభి అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. అయితే బెయిల్‌పై శుక్రవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న ధర్మాసనం కేసు విచారణను శనివారానికి వాయిదా వేసింది. అయితే శనివారం కూడా పట్టాభి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. పట్టాభిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించాల్సిన అవసరం లేదని వాదించారు. పట్టాభికి అత్యవసరంగా బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు పోలీసులు పట్టాభిని కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న ధర్మాసనం పట్టాభికి బెయిల్ మంజూరు చేసింది.
Next Story






