- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరణంలోనూ వీడని బంధం..
<p>దిశ, ములుగు: ఒకే రోజు గుండెపోటుతో దంపతులు మృతి చెందిన ఘటన వెంకటాపూర్ మండలంలో చోటుచేసుకుంది. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలానికి చెందిన మాసపత్రి రాజయ్య, స్వరూప దంపతులు శుక్రవారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో గుండెపోటుకు గురై మృతి చెందారు. మొదట రాజయ్య సతీమణి స్వరూప కు గుండెపోటు వచ్చి మృతి చెందింది. ఈ విషయాన్ని కుమారునికి, బంధువులకు రాజయ్యే స్వయంగా ఫోన్ చేసి చెప్పాడు. అయితే భార్య పై ఉన్న ప్రేమ తనను […]</p>

X
దిశ, ములుగు: ఒకే రోజు గుండెపోటుతో దంపతులు మృతి చెందిన ఘటన వెంకటాపూర్ మండలంలో చోటుచేసుకుంది. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలానికి చెందిన మాసపత్రి రాజయ్య, స్వరూప దంపతులు శుక్రవారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో గుండెపోటుకు గురై మృతి చెందారు. మొదట రాజయ్య సతీమణి స్వరూప కు గుండెపోటు వచ్చి మృతి చెందింది.
ఈ విషయాన్ని కుమారునికి, బంధువులకు రాజయ్యే స్వయంగా ఫోన్ చేసి చెప్పాడు. అయితే భార్య పై ఉన్న ప్రేమ తనను ఉక్కిరిబిక్కిరి చేసింది. కాసేపటికే రాజయ్యకు కూడా గుండెపోటు వచ్చింది. ఆస్పత్రికి తరలిస్తుండగా మర్గ మధ్యలోనే అతను కూడా మృతి చెందాడు. దాంతో ఒక్కసారిగా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story






