మున్సిప‌ల్ సిబ్బందికి నూత‌న వ‌స్ర్తాలు అందజేత..

30

దిశ‌, గండిపేట్ : నార్సింగి మున్సిపాలిటీ ప‌రిధిలోని మొద‌టి వార్డు మున్సిప‌ల్ సిబ్బందికి తాము అండ‌గా ఉంటామ‌ని మున్సిప‌ల్ కౌన్సిల‌ర్ యాద‌మ్మ అన్నారు. గురువారం మున్సిప‌ల్ సిబ్బందికి మున్సిప‌ల్ కార్మికుల‌కు నూత‌న వ‌స్ర్తాలను చైర్మెన్ రేఖాయాద‌గిరితో క‌లిసి పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా కౌన్సిల‌ర్ యాద‌మ్మ మాట్లాడుతూ.. మున్సిపాలిటీలోని త‌మ వార్డులో ప‌ని చేసే కార్మికుల‌కు ఎలాంటి స‌మస్యలు ఉన్నా త‌మ దృష్టికి తీసుకురావాల‌న్నారు. బ‌తుక‌మ్మ ఉత్సవాలు, ద‌స‌రా ఉత్సవాల‌ను ప్రజ‌లంద‌రూ సంతోసంగా నిర్వహించుకోవాల‌న్నారు. అభివృద్ధిలో భాగంగా ఉండే కార్మికులు త‌మ ఆరోగ్యాల‌ను సైతం సంర‌క్షించుకోవాల‌ని సూచించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..