వారిది కరప్షన్.. వీరిది కరెక్షన్!

by  |
వారిది కరప్షన్.. వీరిది కరెక్షన్!
X

సెపరేట్ స్టేట్‌గా ఏర్పడ్డాక తెలంగాణలో కరప్షన్ పెరిగిందని ఒక వెర్షన్. అవినీతిపై సర్వే సూచీలూ దానికి బేస్. వ్యవస్థీకృతమైన ఈ జబ్బు పడిన వాటిల్లో రెవెన్యూ డిపార్టుమెంటుదీ ఫ్రంట్ ఫేస్! అయితే, అవినీతిపరుల ఊడలే కాదు.. అక్కడక్కడా ఆదర్శప్రాయుల జాడలూ ఉన్నాయి. తమ పరిధిలో ఎక్కడా అవినీతి లేకుండా చేస్తున్నారు. కొందరిది కరప్షన్ అయితే, మరికొందరి కరెక్షన్ అన్నమాట.

లేటెస్ట్‌గా నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టరేట్‌ సాక్షిగా డిప్యూటీ తహసీల్దారు జయలక్ష్మి ఈ నెల 24న రూ.లక్ష లంచం పుచ్చుకొని ఏసీబీకి పట్టుబడ్డారు. మారేపల్లి రైతు దోమ వెంకటయ్య 2.25 ఎకరాల భూమి కొన్నారు. వివాదంలో పట్టా మార్పిడికి ఆర్డీవో ఆఫీసులో సెటిల్ కాస్టును రూ.13 లక్షలుగా జయలక్ష్మి రేటు కట్టారు. ఫైనల్‌గా టెన్ ల్యాక్స్‌కు బేరం ఫిక్సయింది. తెలంగాణ నలుమూలల్లో జరిగే అవినీతికి ఇది తాజా మచ్చుతునక. ఈ నాగర్‌కర్నూలు ఉదంతం మరోసారి రెండు సిగ్నల్స్ ఇచ్చినట్టయింది. పుండు మీద కారం చల్లినట్టుగా రెవెన్యూ శాఖను ఏదో చేసేందుకు కాచుక్కూర్చున్న ప్రభుత్వాన్ని ఆదిశగా పురిగొల్పింది. అట్లే, డిమానిటైజేషన్‌తో అవినీతి తగ్గుతుందనే సెంట్రల్‌లోని మోడీ సర్కార్ విధాన నిర్ణయాన్ని ప్రశ్నార్థకం చేసింది!.

ఆదర్శప్రాయుల అడ్రస్ ఇదీ!

మంచి ఆఫీసర్ల ఆనవాళ్ల హింట్ దొరికితే చాలు! జనం, సమస్త మీడియా కళ్లకు అద్దుకొని, నెత్తిన ఎక్కించుకుంటుంది. గుడ్ ఆఫీసర్ల కొరత అంతలా ఉంది మరి. తెలంగాణలో ఇదే ఫిబ్రవరిలో రెండుచోట్ల అద్భుత సన్నివేశాలు ఆవిష్కృతమయ్యాయి. కామారెడ్డి జిల్లా బాన్సువాడ సెగ్మెంట్ నస్రుల్లాబాద్ మండలం సంగెం రైతులది అరిగోస. అటవీ, రెవెన్యూ శాఖల సమన్వయంతో ముడిపడిన భూమి వ్యవహారం ఏండ్లుగా నలుగుతోంది. అట్లాంటి చాలెంజింగ్ వర్కును కంప్లీట్ చేసేందుకే కాబోలు దేవుడిలా బదిలీపై బాన్సువాడ వచ్చారు ఆర్డీవో రాజేశ్వర్. అధునాతన టెక్నాలజీ, సర్వే టీంలను వెంటబెట్టుకొని, థిక్ ఫారెస్టులో కిలోమీటర్ల కొద్దీ తిరిగారు. సర్వే నం.296లో 245 ఎకరాల రెవెన్యూ భూమిని గుర్తించారు. 80శాతమున్న గిరిజనులు సహా 210 మందికి స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ద్వారా పట్టాదారు పాసుపుస్తకాలు ఈ నెల 6న అందించారు. అంతకు ఫోర్‌ డేస్ ముందు ఇట్లాంటి అరుదైన విశేషమే మానుకోట జిల్లాలో నమోదైంది.

మహబూబాబాద్ జిల్లా మల్యాలలో 1,549 మంది రైతులు ఏళ్లుగా సాగు చేస్తున్నారు. వారికి పట్టాదారు పాసు పుస్తకాల్లేవు. రైతుబంధు, రైతు బీమా అందనంత దూరం. 2018లో రికార్డుల నవీకరణ టైంలోనూ మోక్షం రాలేదు. ఈటాస్క్‌ను తహసీల్దారు రంజిత్ కుమార్ టేకప్ చేశారు. జెస్ట్ 6 నెలల్లోనే ఏండ్ల ప్రాబ్లమ్‌కు సొల్యూషన్ చూపారు. పాసు బుక్కులు వాళ్ల చేతుల్లో పెట్టారు. వందలాది రైతులకది ఎంతటి సుదినమో, ఆ డేటూ (02.02.2020) అంతటి ప్రత్యేకమైనదే.

ఆత్మగౌరవ పతాక.. భుజానికెత్తుకున్న సంబురపు ప్రతీక

ఆర్డీవో రాజేశ్వర్, తహసీల్దారు రంజిత్ కుమార్‌ను ఆయా చోట్ల వ్యవసాయదారులు చేతులతో మోశారు. భుజాలకెత్తుకున్నారు. పూలవర్షం కురిపించారు. పండుగకు మించిన పండుగ సంబరాలకు ఆ ఆఫీసర్లనే ప్రతీకలుగా కొలిచారు. ముఖ్యంగా రెవెన్యూశాఖలో ఎక్కడిక్కడ లంచాలతో అధికారులు దొరికిపోతున్నారు. ఇంకా దొరకని వారెందరో! ఇటువంటి టైంలో కమిట్మింట్‌తో ఎంతో శ్రమించి బీద రైతులకు న్యాయం చేసిన వారిలో రాజేశ్వర్ ఒకరు. ఆ డిపార్టుమెంటుకే వన్నె తెచ్చారు. ఆయన్ను ‘దిశ’ ప్రత్యేక ప్రతినిధి ఫోన్‌లో ఇంటర్వ్యూ చేశారు. స్వతహాగా తాను రైతుబిడ్డననీ, రైతులు అభద్రతాభావంతో బతుకకూడదని రాజేశ్వర్ వ్యాఖ్యానించారు. భూమి, భూమిపై హక్కులు వాళ్ల ఆత్మగౌరవానికి చిహ్నమని పేర్కొన్నారు. నాగర్‌కర్నూలు వంటి వైనాలపై స్పందన కోరగా, తమవాళ్లు మారాల్సి ఉందని బదులిచ్చారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed