ధర్మారంలో బయటపడ్డ అవినీతి బాగోతం..

by Vadlamudi Anukaran |   (  Updated:2021-08-14 06:18:14  IST  )

<p>దిశ, దుబ్బాక: మహిళా సంఘాలకు చెందిన సుమారు పదిహేను లక్షల డబ్బులను కాజేసిన సంఘటన ధర్మారం గ్రామంలో చోటుచేసుకుంది. పైసా పైసా కూడబెట్టిన డబ్బులు అప్పనంగా కాజేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో మహిళా సంఘాలతో పాటు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గ్రామానికి చెందిన సర్వీస్ ప్రొవైడర్ గా పనిచేస్తున్న తీపిరెడ్డి అనిత అనే మహిళ ఈ మోసానికి పాల్పడినట్లు ఆరోపించారు. గ్రామంలో మహిళ సంఘాలకు, [&hellip;]</p>

ధర్మారంలో బయటపడ్డ అవినీతి బాగోతం..
X

దిశ, దుబ్బాక: మహిళా సంఘాలకు చెందిన సుమారు పదిహేను లక్షల డబ్బులను కాజేసిన సంఘటన ధర్మారం గ్రామంలో చోటుచేసుకుంది. పైసా పైసా కూడబెట్టిన డబ్బులు అప్పనంగా కాజేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో మహిళా సంఘాలతో పాటు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గ్రామానికి చెందిన సర్వీస్ ప్రొవైడర్ గా పనిచేస్తున్న తీపిరెడ్డి అనిత అనే మహిళ ఈ మోసానికి పాల్పడినట్లు ఆరోపించారు. గ్రామంలో మహిళ సంఘాలకు, వృద్ధులకు, గ్రామస్తులకు మెరుగైన సేవలు అందించేందుకు మిరుదొడ్డి యూనియన్ బ్యాంక్ పరిధిలో కస్టమర్ సర్వీస్ ప్రొవైడర్ గా తీపిరెడ్డి అనితను ఏర్పాటు చేశారు. అయితే తమ బ్యాంకు కు చెల్లించాల్సిన రుణాలు తమకు ప్రతి నెల చెల్లించడం జరుగుతుందన్నారు.

కానీ ఆమె బ్యాంకు లో చెల్లించినట్లు తమకు దొంగ రశీదు ఇవ్వడం జరిగిందని, గ్రామంలో సుమారు 39 మహిళా సంఘాల నుండి దాదాపు 10 నుంచి 15 లక్షల వరకు డబ్బులు కాజేయడం జరిగిందని గ్రామస్తులు వాపోతున్నారు. మహిళా సంఘాల సభ్యులు ప్రతినెల గ్రూపులో కట్టిన డబ్బులను జమ చేయకుండా, నేరుగా వాడుకోవడంతో పాటు దొంగ రశీదులను అప్పగించినట్లు తెలిపారు. ఒక్కసారిగా గ్రామంలో మహిళా సంఘాల్లో డబ్బులు కాజేసినట్లు తెలియడంతో అన్ని గ్రూపుల్లో ఆందోళన నెలకొంది. వృద్ధులు పెన్షన్ కోసం వచ్చిన వారి వద్ద కూడా పెద్ద ఎత్తున డబ్బులు తీసుకోవడం జరిగిందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Next Story