Covid-19 : కరోనా డేంజర్ బెల్స్.. ఇద్దరు మృతి

by Muthe.Rajitha |

భారత్ లో కరోనా(Covid-19) మళ్ళీ పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్(Carona Positive) కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది.

Covid-19 :  కరోనా డేంజర్ బెల్స్.. ఇద్దరు మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : భారత్ లో కరోనా(Covid-19) మళ్ళీ పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్(Carona Positive) కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. అలాగే చాలా కాలం తర్వాత మళ్ళీ కరోనా మరణాలు మొదలవడం తీవ్ర సంచలనం రేపుతోంది. ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్(KEM) ఆసుపత్రిలో సోమవారం ఉదయం ఇద్దరు కోవిడ్-19 పాజిటివ్ రోగులు మరణించినట్టు(Carona Deaths) ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి. ముంబైకి చెందిన 14 ఏళ్ల బాలిక, 54 ఏళ్ల మహిళ కరోనా పాజిటివ్ తో మృతి చెందారు. అయితే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(BMC) మాత్రం వీరి మరణాలకు కరోనా ప్రాథమిక కారణం కాదని, వారిలో ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయని తెలిపింది.

ఇక దేశవ్యాప్తంగా 260 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. కరోనా లక్షణాలు కనిపిస్తే స్వీయ జాగ్రత్తలు పాటించాలని, కరోనా నిర్ధారణ పరీక్ష జరిపించి.. తగిన చికిత్స తీసుకోవాలని తెలిపింది. అలాగే బహిరంగ ప్రదేశాలలో మస్క్ ధరించాలని ప్రజలను కోరింది.

Next Story