Corona update : మళ్లీ దేశంలో కరోనా పంజా..4వేలకు చేరువైన కేసులు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-06-02 06:41:04  IST  )

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్ర‌స్తుతం కేసుల సంఖ్య 4వేల‌కు చేరువ‌లో ఉంది. మొత్తం యాక్టివ్ కేసులు 3,961 ఉన్నాయి. కేర‌ళ‌లో అత్య‌ధికంగా 1435

Corona update : మళ్లీ దేశంలో కరోనా పంజా..4వేలకు చేరువైన కేసులు
X

దిశ‌, వెబ్ డెస్క్: దేశంలో క‌రోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్ర‌స్తుతం కేసుల సంఖ్య 4వేల‌కు చేరువ‌లో ఉంది. మొత్తం యాక్టివ్ కేసులు 3,961 ఉన్నాయి. కేర‌ళ‌లో అత్య‌ధికంగా 1435 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. క‌రోనాతో 24 గంట‌ల్లో మ‌రో న‌లుగురు మృతి చెందారు. ఢిల్లీ, త‌మిళ‌నాడు, కేర‌ళ, మ‌హ‌రాష్ట్ర‌లో ఒక్కొక్క‌రు చొప్పున చ‌నిపోయారు. ఢిల్లీలో 22 ఏళ్ల యువ‌తి మృతి చెంద‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

అంతే కాకుండా ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో దేశంలో చ‌నిపోయిన వారి సంఖ్య 32కు చేరుకుంది. ఇదిలా ఉంటే భారత్‌లో కరోనా వైరస్ కొత్త సబ్ వేరియంట్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ఎన్‌బీ 1.8.1 వేరియంట్‌ను గుర్తించగా, దాని ప్రభావంపై లోతుగా పరిశోధనలు జరుపుతోంది. ఏడాది క్రితం ఇచ్చిన వ్యాక్సిన్ల నిరధక శక్తి తగ్గిపోవడం, ప్రజలు కోవిడ్ రూల్స్ పాటించకపోవడం వల్లనే కేసులు పెరుగుతున్నట్టు డబ్ల్యూహెచ్‌వో భావిస్తోంది.

Next Story