- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశాఖలో కరోనా కలకలం..
<p>విశాఖలో కోవిడ్-19(కరోనా వైరస్) కలకలం సృష్టించింది. నిన్న ఒక్కరోజే ఐదు అనుమానిత కేసులు నమోదు కావడంతో నగరవాసులు భయాందోళనలకు గురవుతున్నారు. వీరంతా విదేశాలకు వెళ్లొచ్చినవారే. ఓ కుటుంబానికి చెందిన భర్త, భార్య, కుమార్తె కొద్దికాలం కిందట కౌలాలంపూర్ వెళ్లి, మంగళవారం రాత్రి విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలతో వీరు బాధ పడుతున్నట్టు గుర్తించిన విమానాశ్రయ అధికారులు, వారిని వెంటనే నగరంలోని ఛాతీ, అంటూవ్యాధుల ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కరోనా స్పెషల్ వార్డుకు […]</p>

విశాఖలో కోవిడ్-19(కరోనా వైరస్) కలకలం సృష్టించింది. నిన్న ఒక్కరోజే ఐదు అనుమానిత కేసులు నమోదు కావడంతో నగరవాసులు భయాందోళనలకు గురవుతున్నారు. వీరంతా విదేశాలకు వెళ్లొచ్చినవారే. ఓ కుటుంబానికి చెందిన భర్త, భార్య, కుమార్తె కొద్దికాలం కిందట కౌలాలంపూర్ వెళ్లి, మంగళవారం రాత్రి విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలతో వీరు బాధ పడుతున్నట్టు గుర్తించిన విమానాశ్రయ అధికారులు, వారిని వెంటనే నగరంలోని ఛాతీ, అంటూవ్యాధుల ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కరోనా స్పెషల్ వార్డుకు తరలించారు. మరోవైపు గతనెల 28న బహ్రెయిన్ నుంచి విశాఖకు వచ్చిన 23ఏళ్ల యువతి, ఆమె స్నేహితుడు కూడా గత రెండ్రోజులుగా జ్వరం, జలుబు, దగ్గుతో బాధ పడుతున్నారు. దీంతో వీరిని కూడా కరోనా వార్డులో చేర్చారు. వీరి ముక్కు, గొంతు నుంచి తీసుకున్న నమూనాలను హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి వ్యాధి నిర్ధారణ కోసం వైద్యులు పంపించారు. రెండు రోజుల్లో వీరి రిపోర్టులు రానున్నాయి.
Tags: CoronaVirus, Vizag, family, Bahrain, airport






