ఇన్‌స్టాగ్రాంలో కరోనా ఫిల్టర్లు.. యూజర్ల ఆగ్రహం

by  |
ఇన్‌స్టాగ్రాంలో కరోనా ఫిల్టర్లు.. యూజర్ల ఆగ్రహం
X

దిశ, వెబ్‌డెస్క్: ఓ వైపు కరోనా సంక్షోభం కారణంగా ప్రపంచ దేశాలు వణికిపోతుంటే.. మరోవైపు కరోనా గురించి ఫొటో ఫిల్టర్లు అప్‌లోడ్ చేయడం గురించి యూజర్లు, ఇన్‌స్టాగ్రాం యాప్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అగుమెంటెడ్ రియాలిటీ ద్వారా ఇన్‌స్టాగ్రాం స్టోరీలలో ఈ ఫిల్టర్లు అందుబాటులో ఉన్నాయి. కరోనా వైరస్ బొమ్మలు, కరోనా వచ్చిందా లేదా? వంటి ఫిల్టర్లు ఇందులో చేర్చారు.

ఇన్‌స్టాగ్రాం ఎఫెక్ట్స్ గ్యాలరీలో కరోనావైరస్ అని సెర్చ్ చేసి, అందరూ ఈ ఫిల్టర్లను ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ ఫిల్టర్ల గురించి యూజర్లు ఇన్‌స్టాగ్రాంను పెద్దఎత్తున విమర్శిస్తున్నారు. ఇలా చేయడం అసంబద్ధమని, సబబు కాదని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ ఫిల్టర్లు రూపొందించిన కొంతమంది మాత్రం, ఈ కరోనా ఫిల్టర్ల ద్వారా ప్రజల్లో అవగాహన పెరుగుతుందని, వైరస్ బారిన పడకుండా ఎలా రక్షించుకోవాలో తెలుస్తుందని సమర్థించుకుంటున్నారు. వాడుకుని విధానాన్ని బట్టి అవి ఉపయోగపడతాయని వారు అంటున్నారు.


Next Story

Most Viewed