16 నుంచి కరోనా వ్యాక్సినేషన్

by  |
16 నుంచి కరోనా వ్యాక్సినేషన్
X

దిశ,వెబ్ డెస్క్: ఈ నెల 16 నుంచి భారత్‌లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు ఉన్నత స్థాయి సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్నారు. దేశంలో కరోనా పరిస్థితులతో పాటు వ్యాక్సినేషన్ విషయంలో పలు రాష్ట్రాల సంసిద్దతపై అధికారులతో ప్రధాని మోడీ శనివారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం వ్యాక్సినేషన్ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం శనివారం అధికారికంగా ప్రకటించింది. వ్యాక్సిన్ విషయంలో 3 కోట్ల మంది ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. 50 ఏండ్లు దాటిన వారికి తదుపరి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. వ్యాక్సినేషన్ పై డిజిటల్ పర్యవేక్షణ చేయనున్నారు.


Next Story

Most Viewed