కరోనా వచ్చిన భార్య ముందే నలుగురు మహిళలతో భర్త మందులో తులుతూ..

by  |
కరోనా వచ్చిన భార్య ముందే నలుగురు మహిళలతో భర్త మందులో తులుతూ..
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంట్లో ఎవరికైనా కరోనా వస్తే ఏం చేస్తారు..? వారిని ఐసోలేషన్ లో ఉంచి జాగ్రత్తగా చేసుకొంటారు. భార్యాభర్తలలో ఒకరికి కరోనా వస్తే వారిని ఎంతో జాగ్రత్తగా చూసుకొంటూ ఉంటారు. వారికి ధైర్యం చెప్పి ఓదారుస్తూ ఉంటారు. ఇక్కడ మనం మాట్లాడుకొనే వ్యక్తి కూడా తన భార్యకు కరోనా వస్తే ధైర్యం చెప్పి ఓదార్చాడు. మాములుగా దైర్యం చెప్తే అతని గురుంచి మనం తెలుసుకొనేది ఏముంటుంది.. అందరిలా కాకుండా కరోనా సోకిన భార్యకు ధైర్యం చెప్పడానికి ఇంట్లో మందు పార్టీ ఏర్పాటు చేశాడు. మళ్లీ అందులోను నలుగురు అమ్మాయిలను ఇంటికి పిలిచి దావత్ ఇస్తున్నంత రేంజ్ లో బిల్డప్ ఇచ్చాడు. చివరికి కటకటాలపాలయ్యాడు. ఈ వింత ఘటన గుజరాత్ లో వెలుగు చూసింది.

అహ్మదాబాద్ మాపిల్ అపార్ట్‌మెంట్‌లో కేతన్ పటాడియా, అమోలా పటాడియా దంపతులు నివాసముంటున్నారు. అయితే కొద్దీ రోజుల క్రితం అమోలా పటాడియా కరోనా బారిన పడింది. దీంతో ఆమె హోమ్ ఐసోలేషన్ లోనే ఉంటూ చికిత్స తీసుకొంటుంది. ఇక ఈ నేపథ్యంలోనే కేతన్ పటాడియా ఇంట్లోనే మందు పార్టీ ఏర్పాటు చేశాడు. ఆ పార్టీకి నలుగురు అమ్మాయిలను కూడా వచ్చారు. వారంతా తాగి, ఎంజాయ్ చేస్తున్నారు. అదే సమయానికి పోలీస్ స్టేషన్ కి ఓ వ్యక్తి కాల్ చేసి కేతన్ పటాడియా ఇంట్లో మందు పార్టీ జరుగుతుందని, మధ్య నిషేధం అమలులో ఉన్న సమయంలో నలుగురు భామలతో అతను ఎంజాయ్ చేస్తున్నాడంటూ సమాచారం వచ్చింది. ఇక ఇది నిజమో, కాదో తెలుసుకోవడానికి పోలీసులు కేతన్ పటాడియా ఇంటికి వెళ్లగా అక్కడ జరుగుతున్నా పార్టీ చూసి పోలీసులు సైతం షాకయ్యారు.

నలుగురు అమ్మాయిలు అందరి చేతిలో బీరు బాటిళ్లు, తాగుతూ తూలుతున్న కేతన్ పక్కన అమాయకంగా ఓ మహిళ కూర్చొని ఉంది. ఆమె మాత్రం తగ్గడంలేదు. ఇక పోలీసులు తమదైన రీతిలో విచారణ మొదలుపెట్టారు. విచారంలో కేతన్ చెప్పిన విషయాలను విని పోలీసులు అవాక్కయ్యారు. తన భార్యకోసమే ఈ పార్టీ ఏర్పాటు చేశానని తెలిపాడు. కరోనాతో భార్య బాధపడుతుంటే ఈ మందు పార్టీ ఏంటి..? అని అడగగా.. ఆమె ఇటీవలే కరోనా నుండి కోలుకున్నదని, కానీ ఆ డిఫ్రెషన్ నుండి బయటికి రాలేకపోతుందని అందుకే తన ఫ్రెండ్స్ ని పిలిచి పార్టీ ఇస్తున్నట్లు తెలిపాడు. అనంతరం కేతన్‌తో పాటు నలుగురు మహిళలను ప్రొహిబిషన్ యాక్ట్ కింద పోలీసులు అరెస్టు చేశారు. అసలు గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లో జరుగుతున్న పార్టీ గురించి పోలీసులకు ఎలా తెలిసిందబ్బా.. అనేగా అందరి డౌట్ .. అయితే మందుపార్టీ గురించి లీక్ చేసింది పార్టీకి వచ్చిన ఓ మహిళ భర్తేనట..

Next Story

Most Viewed