ఏపీలో ఇంటి వద్దనే కరోనా టెస్టులు

by  |
ఏపీలో ఇంటి వద్దనే కరోనా టెస్టులు
X

దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టాలో అన్ని చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఏపీలోని కరోనా చికిత్సనందించే ఆస్పత్రుల సంఖ్యలను పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కరోనా అనుమానితుల కోసం విస్తృత పరీక్షల కోసం సంజీవని బస్సులు ప్రవేశపెట్టారు. క్వారంటైన్ సెంటర్లను నాలుగు రకాలుగా విభజించి సేవలందిస్తున్నారు. అంతటితో ఆగని సీఎం తాజాగా కరోనా లక్షణాలతో బాధపడుతున్నా.. లేకపోతే కరోనా వ్యాధి అనుమానం ఉన్నట్టుగా మానసికంగా సతమతమవుతున్నప్పటికీ కంగారు పడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం సూచించిన వెబ్ సైట్‌లో రిజిస్టర్ చేసుకుంటే ప్రభుత్వ ఆరోగ్య సిబ్బంది 24 గంటల్లో వచ్చి వారిని టెస్ట్ చేసి వెళ్తారని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. రిజిస్ట్రేషన్ కొరకు https://covidandhrapradesh.verahealthcare.com/person/register వెబ్ అడ్రెస్‌కి వెళ్లాలని చెప్పింది. ఇందులో రిజిస్టర్ అయి, పూర్తి వివరాలు నమోదు చేస్తే 24 గంటల్లో వైద్య సిబ్బంది కరోనా నిర్ధారణ పరీక్షల కోసం వస్తారని తెలిపింది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed