- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా టెస్టు ధర రూ. 2200 : మంత్రి ఈటల
<p>దిశ, వెబ్ డెస్క్: ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా టెస్టు ధర రూ. 2200 అని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. సోమవారం ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లాక్ డౌన్ ఎత్తివేసినంక రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నాయన్నారు. కరోనా కట్టడికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నామన్నారు. హైదరాబాద్ లో సామాజిక వ్యాప్తి లేదని కేంద్రం ప్రకటించిందని, ఐసీఎంఆర్ సూచనల మేరకు నడుచుకుంటున్నామన్నారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఏ మాత్రం అనుమానం ఉన్నా […]</p>

దిశ, వెబ్ డెస్క్: ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా టెస్టు ధర రూ. 2200 అని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. సోమవారం ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లాక్ డౌన్ ఎత్తివేసినంక రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నాయన్నారు. కరోనా కట్టడికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నామన్నారు. హైదరాబాద్ లో సామాజిక వ్యాప్తి లేదని కేంద్రం ప్రకటించిందని, ఐసీఎంఆర్ సూచనల మేరకు నడుచుకుంటున్నామన్నారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఏ మాత్రం అనుమానం ఉన్నా పరీక్షలు చేస్తామన్నారు. అదేవిధంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా టెస్టులు చేసేందుకు ధర నిర్ణయించామని, ఒక టెస్టు ధర రూ. 2200 అని, వెంటిలేటర్ పై చికిత్స అందిస్తే రోజుకు రూ. 9 వేలు అని, వెంటిలేటర్ లేకుండా చికిత్స అందిస్తే రోజుకు రూ. 7500 గా ధర నిర్ధారించినట్లు మంత్రి తెలిపారు.






