కరోనాపై ప్రత్యేక దృష్టి

by Chukka Sudharani |   (  Updated:2020-03-20 06:30:23  IST  )

<p>దిశ, మహబూబ్ నగర్: రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా విదేశాల నుంచి జిల్లాకు వస్తున్నవారిపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఇప్పటికే వివిధ దేశాల నుంచి వచ్చిన సుమారు 80 మందిని గుర్తించి, వారిని హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో వచ్చే రెండు, మూడు రోజుల్లో మరో 300 మంది వరకు జిల్లావాసులు విదేశాల నుంచి వచ్చే అవకాశాలున్నాయన్న [&hellip;]</p>

కరోనాపై ప్రత్యేక దృష్టి
X

దిశ, మహబూబ్ నగర్: రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా విదేశాల నుంచి జిల్లాకు వస్తున్నవారిపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఇప్పటికే వివిధ దేశాల నుంచి వచ్చిన సుమారు 80 మందిని గుర్తించి, వారిని హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో వచ్చే రెండు, మూడు రోజుల్లో మరో 300 మంది వరకు జిల్లావాసులు విదేశాల నుంచి వచ్చే అవకాశాలున్నాయన్న సమాచారంతో.. అధికారులు అందుకు కావాల్సిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

ప్రధానంగా కరోనా బారిన పడిన దేశాల నుంచి వచ్చే వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కేంద్రంలోనూ విదేశాల నుంచి వచ్చేవారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జేపీఎన్ఈసీ, పాలమూరు యూనివర్సిటీ క్యాంపస్, పాలమూరు మెడికల్ కళాశాల, ఎస్వీఎస్ వైద్య కళాశాలలో క్వారెంటైన్లను ఏర్పాటు చేశారు. విదేశాల నుండి వచ్చే వారిని నేరుగా ఈ క్వారంటైన్లకు తరలించి 14 రోజులపాటు నిర్బంధంలో ఉంచనున్నారు. వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని తేలిన తర్వాతే ఇండ్లకు పంపించనున్నట్టు అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో వారిలో ఎవరికైనా కరోనా సోకినట్లు అనుమానాలు వుంటే వెంటనే హైదరాబాద్ గాంధీకి తరలించి చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశారు. క్వారంటైన్లలో ఉండేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని జేపీఎన్ఈసీలో 1000 మంది, పాలమూరు యూనివర్సిటీ క్యాంపస్‌లో 500 మంది, పాలమూరు మెడికల్ కళాశాలలో 25 మంది, ఎస్వీఎస్‌లో 50 మందిని ఉంచేలా ఏర్పాట్లు పూర్తిచేశారు. విదేశాల నుంచి వచ్చే వారిపై కూడా ప్రత్యేక నిఘా ఉంచేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. క్వారంటైన్ల ఏర్పాటు విషయంలోనూ ఆయా ప్రాంతాల ప్రజలు, విద్యార్థుల నుంచి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో అధికారులు వారితోనూ చర్చలు జరపడంతోపాటు క్వారంటైన్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ గస్తీని సిద్ధం చేశారు. కాగా, కరోనా భయంతో ఇప్పటికే జనం బయటకు వెళ్ళేందుకు జంకుతున్న విషయం తెలిసిందే.

tags : Corona, Hyd Gandhi Hospital, Mahabubnagar, JPNCE, Palamuru Campus, SVS Medical college

Next Story