ఏపీ భవన్ అధికారికి కరోనా

by Vemula.Srinu Prasad |

<p>దిశ, ఏపీ బ్యూరో: ఢిల్లీలోని ఏపీ భవన్‌లో విధులు నిర్వర్తిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు సంబంధిత అధికారులు ఆదివారం వెల్లడించారు. దీంతో ఆ అధికారిని ఢిల్లీ ఆర్మీ బేస్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వెంటనే ఏపీ భవన్‌ను శానిటైజ్‌ చేసి, ఆంధ్రా, తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ కార్యాలయాలకు సీల్‌ వేశారు. మూడు రోజుల తర్వాతే వీటిల్లోకి అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఐఏఎస్‌ అధికారితో [&hellip;]</p>

ఏపీ భవన్ అధికారికి కరోనా
X

దిశ, ఏపీ బ్యూరో: ఢిల్లీలోని ఏపీ భవన్‌లో విధులు నిర్వర్తిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు సంబంధిత అధికారులు ఆదివారం వెల్లడించారు. దీంతో ఆ అధికారిని ఢిల్లీ ఆర్మీ బేస్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వెంటనే ఏపీ భవన్‌ను శానిటైజ్‌ చేసి, ఆంధ్రా, తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ కార్యాలయాలకు సీల్‌ వేశారు. మూడు రోజుల తర్వాతే వీటిల్లోకి అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఐఏఎస్‌ అధికారితో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తిస్తున్నామని వెల్లడించారు.

Next Story