అండర్ వరల్డ్ డాన్ చోటారాజన్‌‌కు కరోనా.. ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలింపు

by B.Srinivas |

<p>దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలోని తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నాటి అండర్ వరల్డ్‌ డాన్‌ చోటా రాజన్‌కు కరోనా వైర‌స్‌ సోకిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని జైలు అధికారులు నిర్ధారించారు. చోటా రాజన్‌ ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్నాడని, జైలులోని ఆస్పత్రిలో అతనికి చికిత్స అందిస్తున్నామ‌ని అధికారులు తెలిపారు. ఇటీవల కొవిడ్‌ సోకడంతో ప్రత్యేక వార్డులో సాయుధ పోలీసుల పర్యవేక్షణలో అతనికి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే.. సోమవారం పరిస్థితి విషమించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించామని [&hellip;]</p>

Underworld don Chota Rajan
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలోని తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నాటి అండర్ వరల్డ్‌ డాన్‌ చోటా రాజన్‌కు కరోనా వైర‌స్‌ సోకిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని జైలు అధికారులు నిర్ధారించారు. చోటా రాజన్‌ ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్నాడని, జైలులోని ఆస్పత్రిలో అతనికి చికిత్స అందిస్తున్నామ‌ని అధికారులు తెలిపారు. ఇటీవల కొవిడ్‌ సోకడంతో ప్రత్యేక వార్డులో సాయుధ పోలీసుల పర్యవేక్షణలో అతనికి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే.. సోమవారం పరిస్థితి విషమించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించామని వెల్లడించారు. ప్రస్తుతం పోలీసుల పర్యవేక్షణలో చోటారాజన్‌కు చికిత్స జరుగుతోంది.

Next Story