భ‌ద్రాద్రి క‌లెక్ట‌రేట్‌లో కరోనా కలకలం

by Sridhar Babu |

<p>దిశ, కొత్త‌గూడెం: భ‌ద్రాద్రి కొత్త‌గూడెం క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో ప‌నిచేస్తున్న ఓ వ్య‌క్తికి సోమ‌వారం క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. రోజూ ఖమ్మం జిల్లా నుంచి రాకపోకలు సాగిస్తున్న ఆ ఉద్యోగి, మూడ్రోజులుగా క‌రోనా ల‌క్ష‌ణాలు క‌లిగి ఉండ‌టంతో వైద్యులు రెండ్రోజుల క్రితం ప‌రీక్ష‌లు చేయించారు. సోమ‌వారం ఉద‌యం వ‌చ్చిన ఫ‌లితాల్లో సదరు ఉద్యోగికి పాజిటివ్‌గా నిర్ధార‌ణ కావ‌డంతో క‌లెక్ట‌రేట్ ఉద్యోగులు, సిబ్బందిలో తీవ్ర ఆందోళ‌న నెల‌కొంది. దీంతో ఆ ఉద్యోగితో స‌న్నిహితంగా మెలిగిన వారు క్వారంటైన్‌లో ఉండాల‌ని [&hellip;]</p>

భ‌ద్రాద్రి క‌లెక్ట‌రేట్‌లో కరోనా కలకలం
X

దిశ, కొత్త‌గూడెం: భ‌ద్రాద్రి కొత్త‌గూడెం క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో ప‌నిచేస్తున్న ఓ వ్య‌క్తికి సోమ‌వారం క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. రోజూ ఖమ్మం జిల్లా నుంచి రాకపోకలు సాగిస్తున్న ఆ ఉద్యోగి, మూడ్రోజులుగా క‌రోనా ల‌క్ష‌ణాలు క‌లిగి ఉండ‌టంతో వైద్యులు రెండ్రోజుల క్రితం ప‌రీక్ష‌లు చేయించారు. సోమ‌వారం ఉద‌యం వ‌చ్చిన ఫ‌లితాల్లో సదరు ఉద్యోగికి పాజిటివ్‌గా నిర్ధార‌ణ కావ‌డంతో క‌లెక్ట‌రేట్ ఉద్యోగులు, సిబ్బందిలో తీవ్ర ఆందోళ‌న నెల‌కొంది. దీంతో ఆ ఉద్యోగితో స‌న్నిహితంగా మెలిగిన వారు క్వారంటైన్‌లో ఉండాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించిన‌ట్టు స‌మాచారం.

Next Story