తెలంగాణలో భారీగా తగ్గిన పాజిటివ్ కేసులు.. కొత్తగా ఎన్నంటే?

by  |
corona active cases in telangana district wise
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకూ తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,801 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,75,827 కి చేరింది. ఇందులో 5,37,522 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 35,042 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో కరోనాతో కొత్తగా 16 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 3,263కి పెరిగింది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 3,660 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఆదివారం రాత్రి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.


Next Story

Most Viewed