- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బస్సులో ఒంగోలు వచ్చిన కరోనా బాధితుడు
by Vemula.Srinu Prasad |
<p>ఒంగోలుకు చెందిన కరోనా బాధితుడు నెల్లూరు డిపోకి చెందిన ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించినట్టు అధికారులు గుర్తించారు. ఈ నెల 16న నెల్లూరు డిపోకి చెందిన హైదరాబాదు టు చెన్నై బస్సులో ఒంగోలు వచ్చాడని అధికారులు నిర్ధారించారు. వెంటనే ఆ బస్సును హైపోసోడియం క్లోరైడ్ ద్రావణంతో శుభ్రం చేశారు. ఈ రోజు బస్సు 20 మంది ప్రయాణీకులతో హైదరాబాదు నుంచి బయల్దేరింది. నెల్లూరు చేరుకునే సరికి ఈ బస్సులో 16 మంది మిగలగా వారిలో ఆరుగురు నెల్లూరు […]</p>

X
ఒంగోలుకు చెందిన కరోనా బాధితుడు నెల్లూరు డిపోకి చెందిన ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించినట్టు అధికారులు గుర్తించారు. ఈ నెల 16న నెల్లూరు డిపోకి చెందిన హైదరాబాదు టు చెన్నై బస్సులో ఒంగోలు వచ్చాడని అధికారులు నిర్ధారించారు. వెంటనే ఆ బస్సును హైపోసోడియం క్లోరైడ్ ద్రావణంతో శుభ్రం చేశారు. ఈ రోజు బస్సు 20 మంది ప్రయాణీకులతో హైదరాబాదు నుంచి బయల్దేరింది. నెల్లూరు చేరుకునే సరికి ఈ బస్సులో 16 మంది మిగలగా వారిలో ఆరుగురు నెల్లూరు వాసులే కావడం విశేషం. దీంతో వారిని కలిసిన వారందర్నీ ఐసోలేషన్ వార్డులో ఉంచారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో సుమారు 793 మంది ఐసోలేషన్ వార్డుల్లో ఉన్నారు.
Tags: coronavirus, ongole, ap, nellore
Next Story






