ఎంజీఎం ఆస్పత్రిలో కరోనా పేషెంట్ సూసైడ్

by  |

దిశ, కాళోజీ జంక్షన్: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో కరోనా పేషెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆస్పత్రి భవనం మీద నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ నెల24వ తేదీన రూరల్ జిల్లా సంగం మండల కేంద్రానికి చెందిన లింగమూర్తి (35)కరోనాతో ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. డాక్టర్ల సూచన మేరకు కొవిడ్ వార్డులో చికిత్స పొందుతున్నాడు. అయితే, కరోనాతో పాటు బాధితుడు మధుమేహం, కడుపు నొప్పితో బాధపడుతున్నట్లు డాక్టర్‌లు గుర్తించారు. అందుకోసం వైద్యం కూడా అందిస్తున్నారు. ఇదే సమయంలో శుక్రవారం ఉదయం కడుపు నొప్పి తీవ్రం కావడంతో భరించలేక హాస్పిటల్ బిల్డింగ్‌ పైకి వెళ్లి కిందకు దూకేశాడు. ఈ ఘటనలో బాధితుడికి తీవ్ర గాయాలు కావడంతో ప్రాణాలు వదిలాడు. ఇది గమనించిన ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించగా.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Next Story