ఐసీయూ వార్డులో ఎంజాయ్ చేస్తున్న కరోనా పేషెంట్

by  |
ఐసీయూ వార్డులో ఎంజాయ్ చేస్తున్న కరోనా పేషెంట్
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తూ.. ఎంతోమంది ప్రాణాలను తీసుకుంటుంది. వైరస్‌ వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటూ చాలా మంది కోలుకుంటున్నారు. భయపడుతూ కూడా చాలావరకు గుండెపోటుకు గురై ప్రాణాలు వదిలిన సంఘటనలు ఉన్నాయి. ఇటువంటి సమయంలో ఓ కరోనా పేషెంట్ ఇతరులకు ఆదర్శంగా నిలిచింది. కరోనా వైరస్‌ తీవ్రత పెరిగి.. శ్వాసతీసుకోవడం ఇబ్బంది కావడంతో ఐసీయూలో చేర్చారు ఓ 30 సంవత్సరాల యువతిని. అయినప్పటికీ ఏ మాత్రం బెదురులేకుండా ఆమె గత పది రోజులు చికిత్స తీసుకుంటుంది. మ్యూజిక్ వింటూ బెడ్‌పైనే డ్యాన్స్ ఆడుతూ తెగ ఎంజాయ్ చేస్తుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. “Never lose the Hope” క్యాప్షన్ పెడుతూ ప్రముఖ డాక్టర్లు సైతం సదరు యువతిని ఆదర్శంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.

https://twitter.com/drmonika_langeh/status/1391062602860482562


Next Story