కరోనా ఎఫెక్ట్: చెర్వుమాదారంలో లాక్‌డౌన్

by  |
కరోనా ఎఫెక్ట్: చెర్వుమాదారంలో లాక్‌డౌన్
X

దిశ, పాలేరు: కరోనా మహమ్మారి మళ్లీ చాపకింద నీరులాగా విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. తాజాగా.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెర్వుమాదారం గ్రామంలో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో గ్రామస్తులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పదిరోజుల పాటు స్వచ్చంద లాక్‌డౌన్ విధించారు. ఎవరైన అతిక్రమిస్తే రూ.1000 జరిమానా విధిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. కాగా, 6 వేల జనాభా గలిగిన ఈ గ్రామంలో ప్రస్తుతం అధికారికంగా 20 మందికి పైగా కరోనా బాధితులు ఉన్నారని, అనధికారంగా ఎక్కువగానే ఉన్నట్లు సమాచారం. అయితే, పాజిటివ్ వచ్చిన వారు జనాల్లో తిరుగుతుండటంతో గ్రామంలో రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. అంతేగాకుండా.. ఆంధ్రాకు బోర్డర్‌గా ఉండటం కూడా వైరస్ వ్యాప్తికి కారణంగా భావిస్తున్నారు.

దీంతో చేసేదేంలేక లాక్ డౌన్ విధించారు. పదిరోజుల పాటు విధించే ఈ లాక్‌డౌన్‌ను అందరూ తప్పనిసరిగా పాటించాలని కోరారు. అతిక్రమిస్తే రూ.1000 ఫైన్ వేస్తూ కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. నిత్యవసర, కూరగాయలు కొనేందుకు మాత్రమే బయటకు రావాలని సూచించారు. గ్రామంలో సర్పంచ్ సుజాతరెడ్డి, జిల్లా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజేష్, ఎంపీడీఓ చంద్రశేఖర్, ఎస్సై అశోక్ కుమార్ రెడ్డి లాక్ డౌన్ అమలు తీరును పరిశీలించారు. వైరస్‌ను నియంత్రించేందుకు సర్పంచ్ ఈవూరి సుజాత రెడ్డి, పంచాయతీ కార్యదర్శి మహేష్ దగ్గరుండి శానిటైజేషన్, బ్లీచింగ్ చేస్తున్నారు. కరోనా నియంత్రణకు సహకరించాలని సర్పంచ్ సుజాతరెడ్డి, సెక్రెటరీ మహేష్ కోరారు.


Next Story

Most Viewed