గంగా నదిలో కరోనా శవాలు.. ఆ నీరు తాగే వారి పరిస్థితి ఏంటి..?

by  |
గంగా నదిలో కరోనా శవాలు.. ఆ నీరు తాగే వారి పరిస్థితి ఏంటి..?
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి ఎంతటి ప్రళయాన్ని సృష్టిస్తుందో అందరికి తెలిసిన విషయమే. రోజు రోజుకు పెరుగుతున్న కేసులు, రోగులతో నిండిపోతున్న ఆసుపత్రులు, శవాలతో అట్టుడికి పోతున్న శ్మశానాలు. శవాలను కాల్చడానికి శ్మశానంలో కూడా చోటు దొరకని పరిస్థితి. మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించడానికి శ్మశానాలు ఖాళీగా లేకపోవడంతో కరోనా రోగుల మృతదేహాలను గంగా, యమునా నదులలో విసిరేస్తున్నారు. ఉత్తరాదిన గంగా, యమున నదుల్లో నీటిపై శవాలు తేలుతున్న పరిస్థితి దేశ వ్యాప్తంగా ఆందోళనను రేకెత్తిస్తోంది. అయితే ఆ నీటినే ప్రజలు తాగుతున్నారు.. ఆ నీటి వలన కరోనా రాదా..? అనే అనుమానాలు ఎంతోమందిని తొలిచివేస్తున్నాయి. అయితే దీనిపై ఐఐటీ కాన్పూర్ కు చెందిన పర్యావరణ ప్రొఫెసర్ సతీశ్ టారె క్లారిటీ ఇచ్చారు.

ప్రజలెవరూ భయపడాల్సినవసరం లేదని, నీటి వలన కరోనా వచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పారు. అంతేకాకుండా యమునా, గంగా నదిలో నుండి వచ్చే నీటిని పరిశుభ్రపరిచిన తర్వాతే ప్రజల అవసరాలకు సరఫరా చేస్తారని తెలిపారు. వైరస్ ఏమైనా ఉంటే నీరు శుభ్రపరిచే దశలో చనిపోతుందని, కానీ నదుల్లో నీరు తాగేవారు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేశారు.



Next Story