- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒకటితో మొదలై కోటి దాటిన కరోనా
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా కేసులు కోటి మార్క్‌ను క్రాస్ చేశాయి. దేశంలో తొలి కేసు జనవరి, 2020 నమోదైన సంగతి తెలిసిందే. అయితే, తొలి కేసుతో లెక్కిస్తే ఏడాది ముగిసే సమయానికి ఆ సంఖ్య కోటిని క్రాస్ చేయడం ఆందోళనకరం. గతంలో ఇప్పటికీ కేసుల ఉధృతి కాస్తా తగ్గిన వైరస్ తన ఉనికిని కొనసాగిస్తూనే ఉంది. ఇక గత 24 గంటల్లో భారత్‌లో 25,153 కొత్త కేసులు నమోదు అయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా కేసులు కోటి మార్క్‌ను క్రాస్ చేశాయి. దేశంలో తొలి కేసు జనవరి, 2020 నమోదైన సంగతి తెలిసిందే. అయితే, తొలి కేసుతో లెక్కిస్తే ఏడాది ముగిసే సమయానికి ఆ సంఖ్య కోటిని క్రాస్ చేయడం ఆందోళనకరం. గతంలో ఇప్పటికీ కేసుల ఉధృతి కాస్తా తగ్గిన వైరస్ తన ఉనికిని కొనసాగిస్తూనే ఉంది. ఇక గత 24 గంటల్లో భారత్‌లో 25,153 కొత్త కేసులు నమోదు అయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో ఇప్పటివరకు కేసులు కోటి మార్క్‌ను క్రాస్ చేసి ఆ సంఖ్య 1,00,04,599కు చేరింది. గత 24 గంటల్లో 347 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటివరకు వైరస్ కారణంగా మృతుల సంఖ్య 1,45,136కు పెరిగింది. దేశవ్యాప్తంగా 95,50,712 మంది వైరస్‌ను జయించారు. ప్రస్తుతం 3,08,751 యాక్టివ్ కేసులున్నాయి.
Next Story






