70 లక్షలు దాటిన కరోనా కేసులు

by Vadlamudi Anukaran |   (  Updated:2020-10-10 12:50:14  IST  )

<p>దిశ, తెలంగాణ బ్యూరో : దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 70 లక్షల మార్కు దాటింది. కానీ గత మూడు వారాల నుంచీ కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండడంతో ప్రస్తుతం యాక్టివ్ పాజిటివ్ కేసులు కేవలం 13 శాతం లోపు మాత్రమే ఉన్నాయి. గణాంకాల ప్రకారం చూస్తే మొత్తం నమోదైన కేసుల్లో సుమారు 60 లక్షల మంది కోలుకున్నారు. ఇంకా 8.83 లక్షలు మాత్రమే యాక్టివ్ పాజిటివ్‌గా ఉన్నాయి. రెండు వారాల క్రితం [&hellip;]</p>

70 లక్షలు దాటిన కరోనా కేసులు
X

దిశ, తెలంగాణ బ్యూరో :
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 70 లక్షల మార్కు దాటింది. కానీ గత మూడు వారాల నుంచీ కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండడంతో ప్రస్తుతం యాక్టివ్ పాజిటివ్ కేసులు కేవలం 13 శాతం లోపు మాత్రమే ఉన్నాయి. గణాంకాల ప్రకారం చూస్తే మొత్తం నమోదైన కేసుల్లో సుమారు 60 లక్షల మంది కోలుకున్నారు. ఇంకా 8.83 లక్షలు మాత్రమే యాక్టివ్ పాజిటివ్‌గా ఉన్నాయి. రెండు వారాల క్రితం పది లక్షల యాక్టివ్ కేసులుండగా ఇప్పుడు అది గణనీయంగా తగ్గుతూ 8 లక్షల మార్కు దగ్గర ఉంది. కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ శనివారం ఉదయం వెలువరించిన బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటల్లో కొత్తగా 73 వేలకు పైగా కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 69.79 లక్షలకు చేరుకుంది. కానీ సాయంత్రానికి వివిధ రాష్ట్రాల నుంచి కొత్త కేసులు నమోదైన వివరాలు అందడంతో మొత్తం కేసుల సంఖ్య 70 లక్షలు దాటింది. దేశం మొత్తం మీద 926 మంది కరోనా కారణంగా చనిపోవడంతో మృతుల సంఖ్య 1.07 లక్షలు దాటింది.

తెలంగాణలో 9 మంది మృతి

తెలంగాణలో తాజా బులెటిన్ ప్రకారం 1811 కొత్త పాజిటివ్ కేసులు నమోదుకాగా అంతకంటే ఎక్కువ సంఖ్యలో రికవరీలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2.10 లక్షలు దాటింది. రికవరీలు 1.83 లక్షలు ఉండడంతో ప్రస్తుతం యాక్టివ్ పాజిటివ్ కేసులు 26 వేల వరకు ఉన్నాయి. తొమ్మిది మంది ఒకే రోజులో కరోనా కారణంగా చనిపోవడంతో మృతుల సంఖ్య 1,217కు చేరుకుంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో మాత్రం పాజిటివ్ కేసులు యధావిధిగా గణనీయ సంఖ్యలోనే నమోదవుతూ ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో వైరస్ వ్యాప్తి తగ్గినా జనసాంద్రత ఎక్కువగా ఉన్న పట్టణాలు, నగరాల్లో మాత్రం పరిస్థితి ఇంకా అదుపులోకి రావాల్సి ఉంది.

Next Story