కంట్లో కరోనా వైరస్?

by  |
కంట్లో కరోనా వైరస్?
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ కారణంగా చేతులో సబ్బు పెట్టి శుభ్రంగా కడుక్కోవడంలో ఉన్న ఆవశ్యకత ఇప్పటికే అందరికీ అర్థమైంది. చేతులు, ముఖం మీద ఉన్న వైరస్ సంగతి సరే… మరి కంట్లో ఉన్న కరోనా వైరస్ సంగతేంటి? అవును… ఒక్కసారి కరోనా వైరస్ సోకిందంటే అది మానవుడు స్రవించే అన్ని రకాల ద్రవాల్లో నివాసం ఏర్పరుచుకుంటుందని శాస్త్రవేత్తలు ఉంటున్నారు. వైరస్ పూర్తిగా శరీరం నుంచి వెళ్లిపోయిందనుకున్నప్పటికీ ఇటలీలోని మొదటి పేషెంటు ఓ 60 ఏళ్ల మహిళ కంటి ద్రవాల్లో వైరస్ ఆనవాళ్లు కనిపించాయని ఇటలీ వైద్యులు తెలిపారు.

ఈమె జనవరిలో కళ్లకలకతో ఆసుపత్రిలో చేరింది. అప్పుడే ఈమెకు కరోనా వైరస్ సోకింది. తర్వాత నెమ్మదిగా కరోనా లక్షణాలు అందుకున్నాయి. మొత్తానికి అన్నిరకాల చికిత్సలు చేసి ఆమెకు కరోనా తగ్గించి డిశ్చార్జి చేశారు. తర్వాత 10 రోజులకు మళ్లీ పరీక్షలు చేశారు. ఈసారి ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. అయితే 15 రోజులకు ఆమెకు మళ్లీ కళ్లకలక వచ్చింది. అప్పుడు కంటి ద్రవాలను పరీక్ష చేయగా కరోనా వైరస్ ఉన్నట్లు తేలింది. కాకపోతే బయటికి మాత్రం ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. దీన్ని బట్టి కరోనా తగ్గినప్పటికీ కంట్లో దాదాపు 20 రోజుల వరకు వైరస్ క్రియాశీలకంగా ఉంటుందని వైద్యులు స్పష్టం చేశారు. వారి ఈ పరిశోధనను అన్నల్స్ ఆఫ్ ఇంటర్నెల్ మెడిసిన్ మేగజైన్‌లో ప్రచురించారు.

Tags:corona, virus, Italy, eyes, infection, incubation


Next Story

Most Viewed