- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీకృష్ణ జన్మస్థలంపై కంగనా వివాదాస్పద కామెంట్స్
<p>దిశ, సినిమా : బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఉత్తరప్రదేశ్‌లోని మధురలో ఉన్న శ్రీకృష్ణ జన్మస్థలాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా విలేఖరులు అడిగిన ప్రశ్నకు తెలివిగా సమాధానమిచ్చింది కంగనా. వచ్చే ఏడాది మార్చిలో ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ తరపున ప్రచారం చేయనున్నారా? అన్న ప్రశ్నకు.. ‘నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు. ఎవరైతే జాతీయవాదాన్ని ఫాలో అవుతారో వారికి క్యాంపెయిన్ చేస్తా’ అంటూ పరోక్షంగా బీజేపీకి సపోర్ట్ చేయనున్నట్లు […]</p>

దిశ, సినిమా : బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఉత్తరప్రదేశ్‌లోని మధురలో ఉన్న శ్రీకృష్ణ జన్మస్థలాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా విలేఖరులు అడిగిన ప్రశ్నకు తెలివిగా సమాధానమిచ్చింది కంగనా.
వచ్చే ఏడాది మార్చిలో ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ తరపున ప్రచారం చేయనున్నారా? అన్న ప్రశ్నకు.. ‘నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు. ఎవరైతే జాతీయవాదాన్ని ఫాలో అవుతారో వారికి క్యాంపెయిన్ చేస్తా’ అంటూ పరోక్షంగా బీజేపీకి సపోర్ట్ చేయనున్నట్లు తెలిపింది. అలాగే హిందువుల పవిత్ర క్షేత్రమైన శ్రీకృష్ణ జన్మస్థలంలో ఈద్గా ఉండడాన్ని తప్పుపట్టిన భామ.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దీనిపై చర్యలు తీసుకుంటారని, ప్రజలకు అసలైన పుణ్యస్థలాన్ని చూపిస్తారని ఆశిస్తున్నానని చెప్పింది. తన వ్యాఖ్యలు కొంతమంది మనోభావాలను దెబ్బతీసినా.. నిజాయితీపరులు, ధైర్యవంతులు, జాతీయవాదులు వాస్తవాన్ని గుర్తిస్తారని అభిప్రాయపడింది.






