కత్తులు దూస్తున్నారు.. పైచేయి ఎవరిది?

by  |
కత్తులు దూస్తున్నారు.. పైచేయి ఎవరిది?
X

దిశ ఏపీ బ్యూరో: పశ్చిమగోదావరి జిల్లా ప్రజాప్రనిధులు పరస్పరం కత్తులు దూస్తున్నారు. అధికారంలో ఊంటూనే వైరివర్గానికి కొమ్ముగాస్తున్నది ఒకరైతే.. ఆ ఒక్కరిని ఎదుర్కొనేందుకు రంగంలోకి నలుగురు దిగారు. ఈ ఐదుగురు ప్రజాప్రతినిధులు పరస్పరం కేసులు పెట్టుకునేందుకు పోలీస్ స్టేషన్ల మెట్లెక్కితే.. ఇది హద్దులు దాటి హైకోర్టు గుమ్మాన్ని తట్టడం ఏపీలో కలకలం రేపుతోంది. ఇంతకీ పశ్చిమగోదావరిలో మొదలైన ఈ సుడిగుండాలకు అంతం ఎప్పుడు? అన్న ప్రశ్న అందర్లనూ ఉదయిస్తోంది.

వైఎస్సార్పీలో వివాదానికి రఘురామకృష్ణం రాజు ఆరంభం పలికారు. పార్టీలో ఉంటూ అధినేతతో మాటమాత్రమైనా చెప్పకుండా తనకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంటూ విమర్శలు చేశారు. అంతేకాకుండా టీటీడీ నిర్ణయించిన నిరర్థక ఆస్తుల వివాదాన్ని పార్టీకి అంటగడుతూ లేఖ రాశారు. దీంతో పార్టీలో ఆగ్రహం వ్యక్తమైంది. ఇంతలోనే కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని ఏమాత్రం పట్టించుకోకుండా…కరోనా కట్టడితో పాటు, వలస కూలీలను తరలించడంలో తీవ్రంగా విఫలమైన కేంద్ర ప్రభుత్వాన్ని పొగుడుతూ లేఖ రాశారు. ఇది కంటగింపుగా మారింది.

అంతటితో ఆగని రఘురామకృష్ణం రాజు సొంత పార్టీ ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీనిని పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు తప్పుబట్టారు. దీంతో ఆయన రెచ్చిపోయారు. తన సామాజిక వర్గాన్ని విడిచిపెట్టి ఇతర ప్రజాప్రతినిధులపై విరుచుకుపడ్డారు. దీంతో సొంత నియోజకవర్గంలో లుకలుకలు ఆరంభమయ్యాయి. ఆయనపై ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగురవేశారు. నిరసన కార్యక్రమాలు, సహాయనిరాకరణ ప్రారంభించారు. అంతేకాకుండా ఫ్లెక్సీలు, దిష్టిబొమ్మల దహనాలు ఆరంభమయ్యాయి. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన తీరుపై పార్టీ అధిష్ఠానం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన కేంద్రం వద్దకెళ్లి తన గోడువెళ్లబోసుకున్నారు.

ఇక లాభం లేని భావించిన నేతలు ఆయన విమర్శలపై పోలీసులకు ఫిర్యాదులు చేశారు. దీనిని ఊహించని రఘురామకృష్ణం రాజు హైకోర్టుకెళ్లి తనపై కేసులు కొట్టేయాలని కోరారు. మరోవైపు అన్నవైఎస్సార్సీపీని ఎగదోసి సొంత పార్టీపై యుద్ధం ప్రకటించారు. ఏకంగా పార్టీపై అనర్హత వేటు వేయించాలన్న పట్టుదలగా ఉన్నారు. ఆ పరిణామాలన్నింటినీ గమనిస్తున్న అధిష్ఠానం ఆయనపై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. అనర్హత వేటు వేయాలని కోరింది. దీంతో పొమ్మనకుండా పొగబెట్టాలన్నది వైఎస్సార్సీపీ వ్యూహం. పొమ్మంటే అనర్హత వేటు నుంచి తప్పించుకుని బీజేపీలో చేరాలన్నది ఎంపీ వ్యూహం. దీంతో వ్యూహప్రతివ్యూహాలు, ఎత్తుకుపైఎత్తులతో పశ్చిమగోదావరి వైఎస్సార్సీపీ రాష్ట్ర రాజకీయాలను ఆసక్తికరంగా మారుస్తోంది.


Next Story

Most Viewed