- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రసాదంలా కరోనా.. మేయర్ వివాదాస్పద వ్యాఖ్యలు
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: ముంబై మేయర్ కిషోరి ఫెడ్నేకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కుంభమేళాలో పాల్గొని తిరిగి వచ్చే భక్తులందరూ కరోనాను ప్రసాదంలా పంచిపెడతారని ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ముంబైకి తిరిగి వచ్చిన కుంభమేళా భక్తులందరినీ వారి ఖర్చుతోనే క్వారంటైన్‌లో పెడతామన్నారు. అన్ని రాష్ట్రల్లో కూడా కుంభమేళా భక్తులను వారి ఖర్చుతోనే క్వారంటైన్ చేయాలని ఆమె సూచించారు. కరోనాను కట్టడి చేయాలంటే చిన్న చిన్న ఆంక్షలు పెడితే సరిపోవని, ముంబైలో పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించాల్సిందేనని కిషోరి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ముంబై మేయర్ కిషోరి ఫెడ్నేకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కుంభమేళాలో పాల్గొని తిరిగి వచ్చే భక్తులందరూ కరోనాను ప్రసాదంలా పంచిపెడతారని ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ముంబైకి తిరిగి వచ్చిన కుంభమేళా భక్తులందరినీ వారి ఖర్చుతోనే క్వారంటైన్‌లో పెడతామన్నారు. అన్ని రాష్ట్రల్లో కూడా కుంభమేళా భక్తులను వారి ఖర్చుతోనే క్వారంటైన్ చేయాలని ఆమె సూచించారు.
కరోనాను కట్టడి చేయాలంటే చిన్న చిన్న ఆంక్షలు పెడితే సరిపోవని, ముంబైలో పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించాల్సిందేనని కిషోరి ఫెడ్నేకర్ వ్యాఖ్యానించారు. 95 శాతం మంది ప్రజలు కరోనా నిబంధనలను పాటిస్తున్నారని, మిగతా 5 శాతం మంది వల్లనే కరోనా వ్యాప్తి చెందుతుందన్నారు. ముంబైలో కేసులు బాగా పెరిగిపోయాయని ఆమె తెలిపారు.
Next Story






