బీ అలర్ట్ : ఆదిలాబాద్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు

by  |
బీ అలర్ట్ : ఆదిలాబాద్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు
X

దిశ, ఆదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిర్మల్, బైంసా, ఆసిఫాబాద్‌లోని ఏజెన్సీ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కరుస్తుండటంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే, రానున్న 48 గంటల్లో ఉమ్మడి జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. అందుకోసం విద్యుత్ శాఖ సూపరిండెంట్ ఇంజినీర్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు ఎస్సీ ఉత్తమ్ కుమార్ తెలిపారు.

వర్షాలు కురిసే సమయంలో ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు పడిపోయినా, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ వైర్లు కిందపడి నీటిలో మునిగినా వెంటనే 94408 11700, 94408 11671 నెంబర్లకు కాల్ చేసి సమాచారం అందించాలని కోరారు.


Next Story