ప్యాజ్ నహీ హై..

by  |
ప్యాజ్ నహీ హై..
X

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. అందుకే వంటల్లో విరివిగా ఉపయోగిస్తుంటారు. ఉల్లి లేని ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. హోటళ్లు, రెస్టారెంట్లు, రోడ్డుపక్క బజ్జి బండి, చాట్​బండార్​ ఇలా ఎక్కడికి వెళ్లినా మెనూలో భాగంగా ఉల్లిపాయను సర్వ్​ చేస్తుంటారు. కానీ, నేడు ఉల్లిమాట ఎత్తితేనే వ్యాపారులు ఉలిక్కిపడుతున్నారు. ఇక సామాన్యుడికి మోయని భారంగా మారింది. కిలో ఉల్లిగడ్డ మార్కెట్​లో రూ.50పైగా పలుకుతోంది. దీంతో హోటళ్లతోపాటు వంటల్లోనూ వాడడం తగ్గించారు. పానీపూరి బండివద్ద ‘జర ప్యాజ్​దేవో భాయ్.. అంటూ కొసిరి కొసిరి తినే రోజులు పోయాయి.

దిశ ప్రతినిధి, మేడ్చల్: ప్యాజ్ నహీ హై.. బిర్యానీ హోటళ్లు, టిఫిన్ సెంటర్లు ఎక్కడైనా ఇదే మాట. ఆనియన్ దోసెలో నామ్ కే వాస్తే అలా ఉల్లిపాయ చల్లుతున్నారు. గణనీయంగా ఉల్లిపాయల వినియోగం తగ్గించారు. వినియోగదారులు కావాలని పట్టుబడితే ఎక్కువ చార్జీ వసూలు చేస్తున్నారు. కొద్దిరోజులుగా ఉల్లి పాయల ధరలు మండిపోవడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.

వంటింట్లోనూ ఇబ్బందే..

ఇళ్లలో కూడా ఉల్లిపాయల వినియోగం బాగా తగ్గించేశారు. అన్ని రకాల వంటల్లో ఉల్లిపాయ వినియోగిస్తుంటారు. ఏ కూర చేయాలన్నా తప్పనిసరిగా ఉల్లిపాయ ఉండాల్సిందే. ముఖ్యంగా నాన్ వెజ్ వంటకు ఉల్లిపాయ లేకపోతే మాజానే ఉండదు. కానీ, ప్రస్తుత పరిస్థితిలో ఉల్లిపాయ లేకుండానే కూరలు వండుతున్నారు. కొంత మంది ఉల్లికి బదులు క్యాబేజీ, కీరా(దోసకాయ)ను సన్నగా తరిమి వేసుకుని తృప్తి పడుతున్నారు. ధరలు తక్కువగా ఉన్నప్పుడు అన్ని వంటల్లో ఉల్లిపాయలు వాడే సిటీజనులు ప్రస్తుతం నాన్ వెజ్ అత్యవసరమైన వంటల్లో మాత్రమే వినియోగిస్తున్నారు. ఉల్లి ధరలు పెరగడంతో ఉపయోగించడమే మానేసినట్లు గృహిణి హేమ తెలిపారు.

మార్కెట్‌లో భలే గిరాకీ..

నగర మార్కెట్లకు ఉల్లి రవాణా బాగా తగ్గింది. గతంలో కంటే సగం తక్కువగా వస్తున్నట్లు ఉల్లి వ్యాపారులు చెబుతున్నారు. హోల్ సేల్ మార్కెట్ లోనే కిలో ఉల్లి ధర రూ.50 పలుకుతోందని బోయిన్ పల్లి మార్కెట్ వ్యాపారి మాడిశెట్టి గిరిధర్ పేర్కొన్నాడు. బహిరంగ మార్కె ట్ లో మరో రూ.10 అదనం గా ఉంటుందని తెలియజేస్తున్నాడు. పెరిగిన ధరల ప్రభావం హోటళ్లు, టిఫిన్ సెంటర్లపై కనిపిస్తోంది. చాట్ బండా ర్లలో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా తయారైంది. కట్ లెట్, పానీపూరి ఇలా ఏది తినాల న్నా ఉల్లిపాయ కలిస్తేనే వా టికి రుచి. చాట్ బండార్ల వద్ద ఉల్లికి ఆదనం గా రూ.5 నుంచి రూ.10 ఎక్కువ వసూలు చేస్తున్నారు.

Next Story

Most Viewed