- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో పెరిగిన విద్యుత్ వినియోగం.. అధికారుల అలర్ట్
<p>దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ వినియోగం పెరుగుతుంది. ప్రస్తుతం రోజుకు గరిష్టంగా 208 మిలియన్ యూనిట్ల వినియోగం జరుగుతుంది. గత ఏడాది మార్చ్ లో గరిష్ట వినియోగం 206 మిలియన్ యూనిట్లు అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలోనే అత్యధికంగా 208 యూనిట్లు వినియోగం అయ్యింది. రాష్ట్ర విభజన అనంతరం విద్యుత్ కి ఇంత డిమాండ్ రావటం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ ఏడాది మార్చ్ లో అత్యధికంగా రోజుకు […]</p>

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ వినియోగం పెరుగుతుంది. ప్రస్తుతం రోజుకు గరిష్టంగా 208 మిలియన్ యూనిట్ల వినియోగం జరుగుతుంది. గత ఏడాది మార్చ్ లో గరిష్ట వినియోగం 206 మిలియన్ యూనిట్లు అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలోనే అత్యధికంగా 208 యూనిట్లు వినియోగం అయ్యింది. రాష్ట్ర విభజన అనంతరం విద్యుత్ కి ఇంత డిమాండ్ రావటం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ ఏడాది మార్చ్ లో అత్యధికంగా రోజుకు 220 మిలియన్ యూనిట్లకు వెళ్లే అవకాశం ఉంటుందని విద్యుత్ శాఖ అధికారులు చెప్తున్నారు. విద్యుత్ వినియోగం విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి లేదా విద్యుత్ సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం కొనుగోలు చేయని పక్షంలో ఇక విద్యుత్ కోతలు తప్పని సరి. కోతలు తప్పని పరిస్థితి ఎదురైతే రాబోయే వేసవికాలంలో ఉక్కపోతతో రాష్ట్రం అల్లాడి పోవాల్సిందే. సో ఈ పరిస్థితి రాకూడదంటే ప్రజలు విద్యుత్ వినియోగంపై జాగ్రత్తలు పాటించాలని..ఇంధనాన్ని పొదుపుగా వాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.






