ఇళ్ల లబ్ధిదారుల ఇంటికే నిర్మాణ సామాగ్రి- మంత్రి శ్రీరంగనాథరాజు

by Vemula.Srinu Prasad |   (  Updated:2021-08-24 04:38:37  IST  )

<p>దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న కాలనీల నిర్మాణం పనుల్లో వేగం పెంచినట్లు రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు తెలిపారు. తక్కువ ధరకే పేదలకు ఇంటి నిర్మాణ సామాగ్రిని అందిస్తున్నట్లు వెల్లడించారు. తాడేపల్లిలో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన ప్రతి లబ్ధిదారునికి 40 శాతం తక్కువ ధరకే ఇంటి సామాగ్రిని అందిస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా నేరుగా ఇళ్ల లే ఔట్ల దగ్గరకే మెటీరియల్ అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియలో రివర్స్ [&hellip;]</p>

ఇళ్ల లబ్ధిదారుల ఇంటికే నిర్మాణ సామాగ్రి- మంత్రి శ్రీరంగనాథరాజు
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న కాలనీల నిర్మాణం పనుల్లో వేగం పెంచినట్లు రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు తెలిపారు. తక్కువ ధరకే పేదలకు ఇంటి నిర్మాణ సామాగ్రిని అందిస్తున్నట్లు వెల్లడించారు. తాడేపల్లిలో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన ప్రతి లబ్ధిదారునికి 40 శాతం తక్కువ ధరకే ఇంటి సామాగ్రిని అందిస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా నేరుగా ఇళ్ల లే ఔట్ల దగ్గరకే మెటీరియల్ అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియలో రివర్స్ టెండరింగ్ ద్వారా సుమారు రూ.6వేల కోట్లు ఆదా అయినట్లు వివరించారు. ఇంటి నిర్మాణానికి పేదలకు పావలా వడ్డీకి రుణం కూడా ఇప్పిస్తున్నట్లు మంత్రి చెప్పుకొచ్చారు. మరోవైపు లబ్ధిదారులకు ఆప్షన్‌లు బలవంతంగా మారుస్తున్నారన్నది తప్పుడు ప్రచారమని.. లబ్ధిదారులకు ఎలా కావాలంటే అలానే ఇళ్లను నిర్మిస్తున్నట్లు వెళ్లడించారు. అక్టోబర్ 25 నుంచి మూడో కేటగిరి ఇళ్ల నిర్మాణం చేపట్టబోతున్నట్లు మంత్రి శ్రీరంగనాథరాజు తెలిపారు.

Next Story