- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరో కానిస్టేబుల్ సస్పెన్షన్..కారణం అదేనా
<p>దిశ, నిజామాబాద్ : కామారెడ్డి జిల్లాలో సస్పెన్షన్‌కు గురైన కానిస్టేబుళ్ల సంఖ్య ఆరుకు చేరింది. వీరంతా అక్రమ ఇసుక రవాణా కేసులో సంబంధం ఉన్నవారే అని తేలింది. కామారెడ్డిలో ఈ మధ్య కాలంలో అక్రమ ఇసుక దందా జోరుగా నడుస్తోంది.దీనికి పోలీసులు దగ్గరుండి సాయం చేస్తున్నారనే ఆరోపణలు వెలువడటంతో జిల్లా ఎస్పీ శ్వేత విచారణకు ఆదేశించారు.రిపోర్టులో కానిస్టేబుళ్ల హస్తం ఉందని తేలడంతో వారిపై వేటు వేశారు.వివరాల్లోకివెళితే..కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలం తూజాల్ పూర్ వాగు నుంచి కొందరు […]</p>
దిశ, నిజామాబాద్ :
కామారెడ్డి జిల్లాలో సస్పెన్షన్‌కు గురైన కానిస్టేబుళ్ల సంఖ్య ఆరుకు చేరింది. వీరంతా అక్రమ ఇసుక రవాణా కేసులో సంబంధం ఉన్నవారే అని తేలింది. కామారెడ్డిలో ఈ మధ్య కాలంలో అక్రమ ఇసుక దందా జోరుగా నడుస్తోంది.దీనికి పోలీసులు దగ్గరుండి సాయం చేస్తున్నారనే ఆరోపణలు వెలువడటంతో జిల్లా ఎస్పీ శ్వేత విచారణకు ఆదేశించారు.రిపోర్టులో కానిస్టేబుళ్ల హస్తం ఉందని తేలడంతో వారిపై వేటు వేశారు.వివరాల్లోకివెళితే..కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలం తూజాల్ పూర్ వాగు నుంచి కొందరు ఇసుక ఆక్రమ రవాణా చేస్తున్నారు.విషయం తెలుసుకున్న బీబీపేట హెడ్ కానిస్టేబుల్ యూసుఫ్, మరో హోంగార్డ్ అక్రమార్కులను అడ్డుకోవాల్సింది పోయి వారితో కుమ్మక్కయ్యారు.ఈ విషయంపై విచారణ జరిపి హెడ్ కానిస్టేబుల్‌పై వేటు వేయగా, హోంగార్డ్‌కు మెమో జారీ చేసినట్టు జిల్లా ఎస్పీ కార్యాలయం వెల్లడించింది. కాగా, ఇప్పటి వరకు ఐదుగురు కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోగా తాజాగా మరో కానిస్టేబుల్‌పై వేటు పడింది.






