గాంధీ భవన్‌లో.. కరోనా కంట్రోల్ రూమ్ : ఉత్తమ్

by B.Srinivas |

<p>రాష్ట్రంలో కారోనో వైరస్ వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సహాయ సహకారాలు అందించేందుకు కారోనా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సోమవారం గాంధీభవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనాతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఈ 040 24601254 కాల్ చేయాలని సూచించారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కంట్రోల్ రూమ్ పని [&hellip;]</p>

గాంధీ భవన్‌లో.. కరోనా కంట్రోల్ రూమ్ : ఉత్తమ్
X

రాష్ట్రంలో కారోనో వైరస్ వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సహాయ సహకారాలు అందించేందుకు కారోనా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సోమవారం గాంధీభవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనాతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఈ 040 24601254 కాల్ చేయాలని సూచించారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కంట్రోల్ రూమ్ పని చేస్తున్నదని రెండు
షిప్ట్‌లుగా నాయకులు గాంధీభవన్‌లో అందుబాటులో ఉంటారని తెలిపారు. బాధితులు ఫోన్ చేస్తే వారి అవసరాలు బట్టి కాంగ్రెస్ నాయకులు ఆయా ప్రాంతాలలో సహాయ సహకారాలు అందజేస్తారని వివరించారు. ఈ కంట్రోల్ రూమ్ బాధ్యులుగా టీపీసీసీ ఉపాధ్యక్షులు కుమార్ రావ్, ప్రధాన కార్యదర్శి ప్రేమ్‌లాల్‌లను నియమించారు.

Tags : Congress party, set, Corona Control Room, Gandhi Bhawan, uttham kumar reddy

Next Story