కాంగ్రెస్ పార్టీలో విషాదం.. కీలక నేత కన్నుమూత

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతున్నాయి. సామాన్య ప్రజలే కాకుండా సినీ రాజకీయ ప్రముఖులు సైతం రోజూ అనేకమంది మహమ్మారికి బలవుతున్నారు. తాజాగా.. జాతీయ కాంగ్రెస్ పార్టీలో కరోనా విషాదం నింపింది. కరోనాతో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రాజీవ్ సాత‌వ్ కన్నుమూశారు. ఇటీవల కరోనా బారిన పడిన సాతవ్‌ సైణేలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతుండగా, పరిస్థితి విషమించి తుదిశ్వాస [&hellip;]</p>

Rajya Sabha member Rajiv Satav
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతున్నాయి. సామాన్య ప్రజలే కాకుండా సినీ రాజకీయ ప్రముఖులు సైతం రోజూ అనేకమంది మహమ్మారికి బలవుతున్నారు. తాజాగా.. జాతీయ కాంగ్రెస్ పార్టీలో కరోనా విషాదం నింపింది. కరోనాతో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రాజీవ్ సాత‌వ్ కన్నుమూశారు. ఇటీవల కరోనా బారిన పడిన సాతవ్‌ సైణేలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతుండగా, పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి కాంగ్రెస్ నాయకులు సంతాపం ప్రకటించారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటని స్పష్టం చేశారు. కాగా, రాజీవ్ శాత‌వ్‌ మహారాష్ట్రకు చెందిన రాజ్యసభ సభ్యుడు. 2014 ఎన్నికలలో మహారాష్ట్రలోని హింగోలి నుంచి ఎన్నికయ్యారు. సాత‌వ్ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి కూడా. గుజరాత్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు.

Next Story