స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. ఇక వారికి చుక్కలే..!

by Vadlamudi Anukaran |   (  Updated:2020-11-13 07:50:06  IST  )

<p>దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : రేవంత్ రెడ్డి. ప్రజలకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. ఏ పార్టీలో ఉన్నా తనదైన శైలిలో దూకుడును ప్రదర్శిస్తూ దూసుకుపోవడం అతడి నైజం. అటూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే.. ప్రభుత్వ పెద్దలను ఇరకాటంలో పెడుతూ కొరకరాని కొయ్యగా మారాడనడంలో సందేహం లేదు. వందేళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీలో చేరినా ఆ పార్టీ చక్రబంధంలో ఇరుక్కుపోకుండా తనదైన శైలిలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్న చిచ్చరపిడుగు. [&hellip;]</p>

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. ఇక వారికి చుక్కలే..!
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : రేవంత్ రెడ్డి. ప్రజలకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. ఏ పార్టీలో ఉన్నా తనదైన శైలిలో దూకుడును ప్రదర్శిస్తూ దూసుకుపోవడం అతడి నైజం. అటూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే.. ప్రభుత్వ పెద్దలను ఇరకాటంలో పెడుతూ కొరకరాని కొయ్యగా మారాడనడంలో సందేహం లేదు. వందేళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీలో చేరినా ఆ పార్టీ చక్రబంధంలో ఇరుక్కుపోకుండా తనదైన శైలిలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్న చిచ్చరపిడుగు.

పార్టీ ఏదైనా.. చెదరని మార్క్!

రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నా తన నైజాన్ని మార్చుకోకుండా తనదైన శైలిలో ముందుకు సాగుతూ.. తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం అలవాటే. ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన రోజు నుంచి తనకంటూ ఒక్క వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటూ పోతున్నారు. మూస పద్ధతిలో కొనసాగిన కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రాకతో సీన్ మారింది. అప్పటి వరకు పార్టీలో అంతగా ప్రజాకర్షక నేత లేకపోవడంతో సీనియర్ నాయకుల వెంట ఉన్న చాలా మంది ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు రేవంత్ రెడ్డి టీంలో చేరిపోయారు. రేవంత్ దూకుడు చూసిన చాలా మంది నాయకులు ఆయనకు పీసీసీ అధ్యక్ష పదవిని కట్టబెడితే పార్టీ బలోపేతం అవుతుందని, టీఆర్ఎస్ పార్టీ మెడలు వంచగలుగుతాడని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు.

ఇదే దూకుడు కావాలి

జీహెచ్ఎంసీలో వరద నష్టపరిహారం చెల్లింపులో జరిగిన అవకతవకలపై రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని డివిజన్లలో వరదసాయంలో జరిగిన అవకతవకలు, అవినీతిపై ఆందోళనలు చేశారు. అటు ప్రభుత్వాన్ని, అధికారులను నిలదీసి, అక్రమాలను ఎండగట్టారు. అయితే పార్టీ ఒకవైపు ఇతర కార్యక్రమాలపై దృష్టి సారిస్తుంటే రేవంత్ మాత్రం తన సొంత కార్యక్రమాలు చేపడుతున్నాడనే అభిప్రాయాలు పార్టీలో వ్యక్తమయ్యాయి. కానీ జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ మాత్రం స్పీడ్ లేకపోతే ప్రజా మద్దతు కూడగట్టడం చాలా కష్టమని రేవంత్ వర్గీయులు అంటున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రజలకు అర్థం అయ్యేలా వివరించాలంటే రేవంత్ లాంటి నాయకులే కావాలని పార్టీలోని కొందరు నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఆయన చేసే కార్యక్రమాల వల్ల పార్టీకి లబ్ధి చేకూరుతుంది తప్ప.. నష్టం జరిగే అవకాశాలు లేవని పేర్కొంటున్నారు. ప్రజల నుంచి ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తున్న తరుణంలో వారికి మనం సహకరిస్తే.. ప్రజల నుంచి పార్టీకి మద్దతు లభిస్తుందని అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద రేవంత్ స్పీడ్ కాంగ్రెస్ సీనియర్లకు మింగుడు పడకపోయినా కొత్తతరం నాయకులు మాత్రం ఇలాంటి నాయకుడే కావాలని కోరుకుంటున్నట్లు గాంధీభవన్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Next Story